ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..!!
అమరావతి: దేశంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. మధ్య తరగతి కుటుంబానికీ నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలకు 87 కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది.
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ పేర్లను ఈ జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. దాదాపుగా అన్ని రాష్ట్రాల పేర్లూ ఈ లిస్ట్‌లో పొందుపరిచింది.

ఏపీ వాటాగా ఏకంగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి మరిన్ని కేంద్రీయ విద్యాలయాలను కేటాయించాలంటూ ఇదివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను యధాతథంగా ఆమోదించింది.
రాష్ట్రానికి కేటాయించిన ఈ ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు- అనకాపల్లి, అన్నమయ్య రాయచోటి జిల్లా మదనపల్లి మండలంలోని వలసాలపల్లి, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం, పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని తాళ్లపల్లిల్లో ఏర్పాటు కానున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని రొంపిచర్ల, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్‌లల్లో కొత్తగా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న కేంద్రీయ విద్యాలయాల సంఖ్య 35 నుంచి 43కు పెరగనుంది.












Click it and Unblock the Notifications