సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు - బాలయ్య : భోగి వేళ మంత్రి పెద్దిరెడ్డికి వార్నింగ్..!!
నారా - నందమూరి కుటుంబాలు సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. నారావారిపల్లెలో భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటిదగ్గర నటుడు బాలయ్య కుటుంబసభ్యులతో కలిసి భోగిమంటలు వేశారు. రెండు కుటుంబాలతో పాటుగా బంధువుల..గ్రామస్థులు వారితో కలిసారు. రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబర్.1 ను భోగి మంటల్లో వేసారు. హీరో బాలయ్య ప్రతీ ఒక్కరినీ పలకరించారు. భోగి శుభాకాంక్షలు చెప్పారు. తన సినిమా వీరసింహారెడ్డి సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

భోగి మంటల్లో జీవో నెంబర్ 1 ప్రతుల దహనం
సంక్రాంతి వేడుకల కోసం నారావారిపల్లె చేరుకున్న నారా - నందమూరి కుటుంబాలు భోగి సంబరాల్లో పాల్గొన్నారు. వీరసింహారెడ్డి బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబుకు పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు పార్టీ నేతలు..కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారి సమక్షంలోనే భోగి మంటలు వేసారు. అందులో ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ప్రతులను వేసి దహనం చేసారు. ఈ జీవో వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారానికి కారణమైంది. హైకోర్టు ఈ జీవో అమలును తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబు కార్యకర్తలను భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. పండుగ వేళ పార్టీ కార్యకర్తలు జైళ్లో ఉండటం పైన ఆవేదన వ్యక్తం చేసారు.
సున్నితంగా కాదు..కఠినత్వం చూస్తారు
పుంగనూరులో పది రోజుల్లో వంది మందిపైన కేసులు పెట్టారని వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి వచ్చే పండుగకు ఎక్కడ ఉంటావో చూసుకో అంటూ చంద్రబాబు హెచ్చరించారు. అన్ని లెక్కులను రాస్తున్నానని..ఈ సారి క్షమించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారని విమర్శించారు. ఇటుక ఇటుక పేర్చి తాను రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడితే అన్నీ నాశనం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలపై పన్నులు, ఛార్జీల భారం మోపుతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు తన సున్నితత్వం చూసారని..ఇక పై కఠినాన్ని చూస్తారని వెల్లడించారు. కందుకూరులో ప్రభుత్వం కుట్ర చేసి తొక్కిసలాటకు కారణమైందని ఆరోపించారు. గుంటూరు సభలోనూ కుట్ర కోణం ఉందని, త్వరలోనే బయటకు వస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 175 నియోజకవర్గాలు గెలవాలని పార్టీ నేతలు..కార్యకర్తలకు చంద్రబాబు నిర్దేశించారు.

నారావారా పల్లెలో వీర సింహారెడ్డి సందడి
నారావారిపల్లెలో మార్నింగ్ వాక్ చేసిన వీరసింహా రెడ్డి బాలయ్య గ్రామస్థులతో ముచ్చటించారు. భోగి మంటలతో చలి కాచుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పారు. వీర సింహారెడ్డి అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగిన..అందరూ మెచ్చే సినిమా అని చెప్పుకొచ్చారు. సినిమాను సక్సెస్ చేసి వారిని ధన్యవాదాలు చెప్పారు. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగగా పేర్కొన్నారు. రాష్ట్రం బాగుండాలని మంచి నాయకత్వం రావాలని బాలయ్య ఆకాంక్షించారు. ఈ రోజు రేపు నారావారి పల్లెలో పలు కార్యక్రమాల్లో చంద్రబాబు - బాలయ్య పాల్గొంటారు. ఈ నెల 27 నుంచి కుప్పం నియోజకవర్గంలోనే నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. మూడు రోజులు కుప్పం నియోజకవర్గంలోనే కొనసాగనుంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications