చంద్రబాబు సోదరుడి పరిస్థితి విషమం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు పరిస్థితి విషమంగా ఉంది. కొంత కాలంగా అనారోగ్యంతో రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి పై సీఎం చంద్రబాబు ఆరా తీసారు. పరిస్థితి తెలుసుకున్న మంత్రి లోకేష్ తన అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకొని హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. చాలా కాలంగా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంత్రి నారా లోకేశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ చేరుకుంటున్నారు.

ఢిల్లీలో ఉన్న చంద్రబాబు తన సోదరుడి ఆరోగ్య పరిస్థితి పై వైద్యులతో మాట్లాడారు. రామ్మూర్తి నాయుడు నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ దంపతుల రెండో కుమారుడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు నటుడు రోహిత్ కాగా, రెండో కుమారుడు గిరీష్. రామ్మూర్తి నాయుడు 1994 లో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత అనారోగ్యంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కుమారుడు రోహిత్ వివాహ నిశ్చితార్దం జరిగింది. మంత్రి లోకేష్ తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి పై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications