చంద్రబాబు ఆశలన్నీ అక్కడే - మరో సీనియర్ లాయర్ ఎంట్రీ...!!

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్వాష్ పిటీషీన్ ను సుప్రీం (Supreme Court)లో దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు నేడు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించాలని భావిస్తున్నారు. ఇటు ఏసీబీ కోర్టు(ACB Court)లో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరగనుంది. హైకోర్టులో డిస్మిస్ అయిన క్వాష్ వ్యవహారం పైన సుప్రీంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు లాయర్ల టీంలో మరో ప్రముఖ న్యాయవాది ఎంట్రీ ఇచ్చారు.

సుప్రీంలో క్వాష్ పిటీషన్:చంద్రబాబు బెయిల్ పిటీషన్ (Bail Petition) విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల సీఐడీ కస్టడీ (CID Custody) ముగియడంతో మళ్లీ కస్టడీకి కావాలని సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. కస్టడీ పొడిగింపు పిటీషన్‌పై తమ వాదనలు కూడా వినాలని చంద్రబాబు తరపు న్యాయవాది పోసాని నిన్ననే కోరారు. ఈ రోజు మెమోపై కోర్టు విచారించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో పిటీ వారెంట్‌లపై కూడా విచారించాలని సీఐడీ కోరింది. కాగా సుప్రీం కోర్టు (Supreme Court)లో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటీషన్‌పై ఏమి జరుగుతుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Chandra Babu lawyer to mention Quash petition before CJI bench today, Bail case in ACB court

సీనియర్ లాయర్ల వాదనలు:చంద్రబాబు కేసులు వాదించేందుకు ఆయన లాయర్ల టీంలో ఇప్పుడు ప్రముఖ న్యాయవాది ప్రమోద్ దూబే (Pramod Dubey)చేరారు. ఏసీబీ కోర్టులో జరిగే బెయిల్ పిటీషన్ విచారణలో చంద్రబాబు తరపు ప్రమోద్ దూబే వాదనలు వినిపించనున్నారు. దూబే తో పాటుగా సిద్దార్ధ్ లూథ్రా(Luthra Team) టీం వాదనల్లో పాల్గొంటుంది. అటు సుప్రీంకోర్టు లో క్వాష్ పిటీషన్ విచారణకు స్వీకరిస్తే అక్కడ చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీస్ సాల్వే, సిద్దార్ధ అగర్వాల్ వాదనలు వినిపించేందుకు సిద్దమయ్యారు.

ఏపీ హైకోర్టు(AP High Court)లో ఈ రోజునే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్..ఫైబర్ గ్రిడ్ స్కాం, అంగల్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ పైన విచారణ జరగనున్నాయి. హైకోర్టులో చంద్రబాబు తరపు దమ్మలపాటి శ్రీవివాస్ తో పాటుగా పోసాని వేంకటేశ్వర్లు వాదనలు వినిపించనున్నారు.

Chandra Babu lawyer to mention Quash petition before CJI bench today, Bail case in ACB court

బెయిల్ పిటీషన్ పైన విచారణ:చంద్రబాబు క్వాష్ పిటీషన్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. దీని కోసమే హైకోర్టులో తిరస్కరించినా..ఇప్పుడు సుప్రీం(Supreme Court)లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ నెల 28వ తేదీ తరువాత అక్టోబర్ 3వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులుగా చెబుతున్నారు. దీంతో, ఈ నాలుగు రోజుల్లో క్వాష్ పిటీషన్(Quash Petition) పైన సుప్రీం నిర్ణయం తీసుకుంటుందా..

ఎలాంటి నిర్ణయం వస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక, ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ తో పాటుగా సీఐడీ చంద్రబాబు(Chandra Babu) కస్టడీ పొడిగింపు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్..అదే సమయంలో పీటీ వారెంట్ల పైన విచారణ జరగనుంది. ఈ మొత్తం కేసుల వ్యవహారంలో ఎక్కడ ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+