Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆనంకు చంద్రబాబు బిగ్ టాస్క్ - సమర్ధతకు పరీక్ష, సిద్దమేనా..!!

ఏపీ ఎన్నికల వేళ నెల్లూరు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జిల్లాలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో లెక్కలు మారుతున్నాయి. దీంతో, ఇక్కడ తిరిగి పట్టు కోసం వైసీపీ...తమ సత్తా చాటేందుకు టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో జిల్లాలో సీనియర్లకు ఖరారు చేస్తున్న స్థానాల్లో గెలుపు పైన పార్టీలో ఉత్కంఠ పెరుగుతోంది.

మారుతున్న లెక్కలు
నెల్లూరు జిల్లాలో ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు ఎంపీతో పాటుగా పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ సారి అదే విధంగా పట్టు నిరూపించుకోవాలని భావిస్తోంది. వైసీపీలో టీడీపీ చేరిన నేతల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టీడీపీ నెల్లూరు రూరల్ సీటు కేటాయించింది. వైసీపీ నుంచి అక్కడ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ హోరా హోరీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. రూరల్ సీటు గెలిచి కోటంరెడ్డికి షాక్ ఇవ్వాలని వైసీపీ...ఎలాగైనా గెలిచి తన బలం చాటుకోవాలని కోటంరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో నేత మేకపాటి చంద్ర శేఖర రెడ్డికి ఉదయగిరి సీటు టీడీపీ నుంచి దక్కటం లేదు. అక్కడ టీడీపీ ఎన్నారై సురేశ్ కు సీటు కేటాయించారు.

Chandra Babu liekly to Fied Anam form Atmakuru in next Elections against Mekapati

ఎవరు ఎక్కడ నుంచి
సురేష్ కు సీటు కేటాయింపు పైన సీనియర్ నేత బొల్లినేని రామారావు మనస్థాపానికి గురయ్యారు. ఇక, మరో సీనియర్ నేత ఆనం సీటు గురించి టీడీపీలో చర్చ సాగుతోంది. ఆనం ప్రస్తుతం వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తిరిగి అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరటం ఎంపీగా పోటీ చేస్తుండటంతో..ఆయన సూచనల మేరకు కొన్ని సీట్లలో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి పోటీ చేస్తారని చెబుతున్నారు. సర్వేపల్లి కాకుండా ప్రశాంతి కోవూరు నుంచి పోటీ చేస్తే సర్వేపల్లి నుంచి ఆనంను బరిలోకి దింపాలనే ఆలోచన టీడీపీ నాయకత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు మాత్రం ఆనం సీటు విషయంలో మరోవిధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఆత్మకూరు బరిలో ఆనం
ఆనం రామనారాయణరెడ్డిని ఆత్మకూరు నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆత్మకూరులో వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు టీడీపీ గెలవలేదు. 2014,2019 లో వైసీపీ అభ్యర్ది మేకపాటి గౌతమ్ రెడ్డి గెలుపొందారు. ఆయన హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. ఆనం ఇదే నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్దిగా గెలుపొందారు. ఈ సారి తిరిగి అక్కడి నుంచే పోటీ చేయాలని చంద్రబాబు కోరుతున్నా..ఆనం సుముఖంగా లేరనే ప్రచారం సాగుతోంది. దీంతో, ఇప్పుడు ఆనంతో పాటుగా సోమిరెడ్డి సీటు విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+