విశాఖకు రాజధాని కావాలా -అభివృద్ధి కావాలా : నన్ను అడ్డుకుంటే ఖబడ్దార్ - జగన్ కు చంద్రబాబు సవాల్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పైన విరుచుకుపడ్డారు. ఐరన్ లెగ్ సీఎం జగన్ ఉన్నారంటూ ధ్వజమెత్తారు. తాను రుషికొండకు వెళ్తుంటే అడ్డుకోవటం పైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పదో తరగతి పరీక్షా పేపర్లు లీక్ అవుతుంటే మంత్రిగా బొత్సా ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ చేసారని ఆరోపించారు. ఇప్పుడు పరీక్షల్లో కాపీ కొట్టించి పాస్ చేస్తే.. రేపు ఉద్యోగాలకు ఏం చేస్తారని నిలదీసారు. రాష్ట్రం మీద ఇప్పటికే రూ 8 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని..కేంద్రం చీవాట్లు పెట్టినా మార్పు రావటం లేదని ధ్వజమెత్తారు.
ఆ రుణాలు అన్నీ తరువాతి కాలంలో ప్రతీ ఒక్కరి మీద పడుతాయని చెప్పుకొచ్చారు. అత్యాచారాల విషయంలో హోం మంత్రి వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. తాను రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్లగలనని.. ఏ ఇంటికి అయినా వెళ్తానని స్పష్టం చేసారు. విశాఖలో సీఎం జగన్..సాయిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. విశాఖకు రాజధాని కావాలా -అభివృద్ధి కావాలా అంటూ చంద్రబాబు సభకు హాజరైన వారిని ప్రవ్నించారు. తాను అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తానని..విశాఖను ఫైనాన్స్..టూరిజం-ఫార్మా హబ్ గా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

విశాఖకు అన్యాయం చేయాలని చూస్తే వారి గుండెల్లో నిద్ర పోతానంటూ చంద్రబాబు హెచ్చరించారు. నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలో కల్లా పెట్రోధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు అధికంగా ఉంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని..సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ చేసారు. అన్నారు.పెళ్లి అయితే కళ్యాణ కానుక, పండుగ అయితే పండుగ కానుక ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేసారు.
కోర్టు ఆదేశంతో గ్రామ సచివాలయాల రంగులు మార్చారని, రంగుల మార్పు కోసం ప్రజాధనాన్ని వృథా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తన పోరాటం తన కోసం కాదని..ప్రజల కోసమని చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ కోసం పని చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేసారు. ప్రజలతో మమేకం అయిన వారికే పదవులు దక్కుతాయని చంద్రబాబు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications