Gudivada politics:అఫీషీయల్,కొడాలి నాని పై టీడీపీ అభ్యర్ధి ఫిక్స్ - గెలుపెవరిది..!!
ఏపీలో ఎన్నికలు హీట్ కనిపిస్తోంది. ప్రతీ సీటు..ప్రతీ ఓటు కీలకమే. వై నాట్ 175 నినాదంతో సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 160 సీట్లలో గెలుపు ఖాయమంటూ టీడీపీ నాయకత్వం విశ్వాసం తో ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుడివాడ సీటు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అక్కడ ఎలాగైనా మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలనేది టీడీపీ లక్ష్యం. ఇందు కోసం అనేక తర్జన..భర్జనల తరువాత సర్వేల ఆధారంగా ఎట్టకేలకు అభ్యర్ధిని డిసైడ్ చేసారు.
టీడీపీకి ప్రతిష్ఠాత్మకం
ఉమ్మడి కృష్ణా జిల్లా తొలి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. అందులో గుడివాడ నియోజకవర్గం టీడీపీతో ప్రత్యేక అనుబంధం. 1983,1985 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విజయం సాధించారు. 2000లో జరిగిన ఉప ఎన్నికలో రావి వేంకటేశ్వరరావు గెలుపొందారు. 2004,2009 లో టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని..2014,2019లో వైసీపీ నుంచి గెలుపొందారు. 2019లో కొడాలి నాని పైన దేవినేని అవినాశ్ ను చంద్రబాబు బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో 19,479 ఓట్ల మెజార్టీతో నాని గెలుపొందారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్ లక్ష్యంగా కొడాలి నాని చేసిన ఆరోపణలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి.

కొడాలి నాని వర్సస్ రాము
వచ్చే ఎన్నికల్లో టీడీపీ హిట్ లిస్టు నియోజకవర్గాల్లో గుడివాడ తొలి స్థానంలో ఉంది. అక్కడ కొడాలి నాని పైన బలమైన అభ్యర్ధిని దించాలని చాలా కాలంగా చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారు. తాజాగా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పేరును టీడీపీ అధినేత ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నారై అయిన రాము నియోజకవర్గాల్లో చాలా రోజులుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. కొడాలి నానికి ధీటుగా కార్యక్రమాల నిర్వహణలో పార్టీ శ్రేణులను ఏకం చేస్తున్నారు. గుడివాడలోని సామాజిక సమీకరణాలు కూడా ఆయన విజయానికి కలిసి వస్తాయనే నమ్మకంతో టీడీపీ నాయకత్వం ఉంది. కొడాలి నానిని ఢీ కొట్టాలంటే అన్ని రకాలుగా బలమైన అభ్యర్థి కావాలని భావించిన టీడీపీ వెనిగళ్ల రాము పేరును డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.

రావికి ఎమ్మెల్సీ హామీ
ఎన్నికల్లో పోటీ చేసే దాదాపు 70 నియోజకవర్గాలకు చంద్రబాబు పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసారు. రిజర్వ్ నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం దిశగా ముఖ్య నేతలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా..ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నగుడివాడ,గన్నవరం నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే రావి వెంకటేశ్వరరావు తో రెండు దఫాలుగా అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రాముకు సీటు ఇస్తున్నట్లు చెబుతూ, రావిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి
గుడివాడలో ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గంలోని సాంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటుగా ఎస్సీ సామాజిక వర్గంలోని ఓటర్లు రామువైపు మొగ్గుచూపుటంతో చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు వివరించారు. ఇదే సమయంలో రావి వెంకటేశ్వరరావుకు కృష్ణా జిల్లా నుండి మొట్టమొదటి శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో, ఇక గుడివాడలో హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications