మోదీకి చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్ - ఆమోదిస్తే, గేమ్ ఛేంజర్..!!

ఏపీలో కీలక ఘట్టానికు రంగం సిద్దం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 18న ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మది నెలలు పూర్తయింది. దీంతో, పాలనా పరంగా నిర్ణయాలను వేగవంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ సారి ఢిల్లీ పర్యటన కీలకంగా మారుతోంది. మోదీ తో భేటీ వేళ చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈ మేరకు అంగీకారం తెలిపితే ఏపీకి కీలక మలుపు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీకి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు (మంగళవారం) మధ్నాహ్నం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఆ రాత్రి అక్కడ బస చేస్తారు. 18వ తేదీ ఉదయం ప్రధానితో భేటీ కానున్నారు. ఆర్దిక సంవత్సరం ముగింపు వేళ ఆర్దికంగా శాఖల వారీగా ఏపీకి దక్కే ప్రయోజనాల పైన చంద్రబాబు కసరత్తు చేసారు. కొత్త ప్రతిపాదనలతో ఢిల్లీకి వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రధానితో భేటీ వేళ అమరావతి పైన కీలక చర్చ జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కేంద్రం సైతం అమరావతి కి ఆర్ది కంగా తోడ్పాటు అందిస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ 13 వేల కోట్ల రుణం మంజూరు కాగా, కేంద్రం రూ 1500 గ్రాంట్ గా ఆమోదించింది.

రాజధాని పనులు
అమరావతిలో తిరిగి పనులు ప్రారంభానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అమరావతికి ప్రధాని మోదీని ఈ పర్యటన లో చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అమరావతి రాజ ధానికి 2015 అక్టోబర్ 21న ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారు. ఆ తరువాత అమరావతి వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మూడు రాజధా నుల అంశం తెర మీదకు తీసుకు రావటంతో అమరావతి పూర్తిగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి పనుల కోసం ముందుగా ఆర్దిక వనరుల సమీకరణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రపంచ బ్యాంకు - ఏడీబీ నుంచి రూ 13 వేల కోట్ల మేర రుణం అమరావతికి మంజూరు అయింది. అదే విధంగా ఇతర ఆర్దిక సంస్థల నుంచి రుణాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనుల ప్రారంభానికి టెండర్లు ఆహ్వానించారు.

chandra-babu-to-invite-pm-modi-for-amravati-works-re-launch-in-next-month

అమరావతికి ప్రధాని
ప్రధానిని ఆహ్వానించటం ద్వారా అమరావతి పనులు తిరిగి ప్రారంభ వేడుకను గణంగా నిర్వహిం చేందుకు సిద్దం అవుతున్నారు. ఏప్రిల్ లో ఈ మేరకు వేడుకలా నిర్వహణ కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధాని షెడ్యూల్ మేరకు ముహూర్త తేదీ ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాజధాని అమరావతి లో రూ రూ.64,721 కోట్ల ఖర్చుతో పనులు చేపడుతున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో రూ 11 వేల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. తాజాగా రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. 2028 నాటికి లక్ష్యంగా ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. ఇక, ప్రధాని రావటం ద్వారా అమరావతి వైపు దేశం మొత్తం ఇటు చూస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని పర్యటన పైన చంద్రబాబు సమావేశంలో ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+