వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూటు మార్చిన చంద్రబాబు - సీఎంపై ఒత్తిడి పెంచేలా..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ 2024 దిశగా అడుగులు వేస్తున్నారు. అందివచ్చిన ఏ అవకాశం వదులుకోవటానికి సిద్దంగా లేరు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా.. తాజాగా గోదావరి వదర ప్రభావిత జిల్లాల్లో రెండు రోజులు పర్యటించిన చంద్రబాబు..ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. సీఎం జగన్ ను టార్గెట్ చేసారు. దీనికి కౌంటర్ గా సీఎం జగన్ నిన్న..ఈ రోజు ముంపు బాధిత గ్రామాల్లో పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడుతున్నారు.

విలీన మండలాల్లో కొత్త రాజకీయం

విలీన మండలాల్లో కొత్త రాజకీయం

అదే సమయంలో చంద్రబాబు తన పైన చేసిన విమర్శలకు సెటైరికల్ గా సమాధానం ఇచ్చారు. ఇక, తాజాగా అల్లూరి జిల్లా తెలంగాణ సరిహద్దులోని అయిదు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలంటూ ఆందోళన చేస్తున్నారు. వరద సమయంలో తమకు ఎటువంటి సాయం అందలేదని నిరసకు దిగారు. వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం మద్దతు పలికారు. ఈ సమయంలో చంద్రబాబు కొత్త రూటు ఎంచుకున్నారు. వరద ప్రాంతాల్లో మరోసారి పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

తెలంగాణలో కలపాలంటూ డిమాండ్

తెలంగాణలో కలపాలంటూ డిమాండ్

ముంపు గ్రామాల్లో పర్యటిస్తానని గత పర్యటన సమయంలోనే వెల్లడించిన చంద్రబాబు.. ఇప్పుడు గురు..శుక్రవారాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పోలవరం కోసం తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆ మండలాల్లొని గ్రామాల్లోనే చంద్రబాబు పూర్తి స్థాయిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి భద్రాచలంలోనే బస చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్ విలీన గ్రామాల్లో పర్యటన సమయంలో తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్ కొందరు గ్రామ ప్రజలు సీఎంతో నేరుగా ప్రస్తావించారు.

సీఎం హామీ.. చంద్రబాబు పర్యటన

సీఎం హామీ.. చంద్రబాబు పర్యటన


సీఎం..జగన్ దీనికి స్పందించి పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చాకే..పోలవరం లోకి నీరు విడుదల చేసే సమయానికి ముందే పరిహారం అందిస్తామని..అప్పటి వరకు నీరు విడుదల చేయమని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఆరు ముంపు మండలాలను కలిపి ఒక రెవిన్యూ డివిజన్ గా మార్చే అంశం పైన సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు చంద్రబాబు విలీన మండలాల్లోని గ్రామాల పర్యటనకు వెళ్లనుండటంతో..ఇప్పుడు ఈ గ్రామాలు తెలంగాణలో విలీనం డిమాండ్..సీఎం జగన్ హామీల నేపథ్యంలో ..చంద్రబాబు పర్యటన రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
TDP Chief Chandra Babu decided to visit godavati flood effected mandals wich merged in AP For polavaram project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X