జగన్ వస్తే కుప్పంలో ఓడుతానని బాబు భయం: అంబటి

జగన్ బయటకు వస్తే కుప్పంలో కూడా ఓడిపోతానని బాబు భయపడుతున్నారన్నారు. బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు తన పార్టీ ఎంపీలను ఢిల్లీ పంపి వ్యవస్థలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసును నిర్భయ కేసుతో పోల్చి బాబు రాక్షసానందం పొందుతున్నారన్నారు.
సామాజిక అత్యాచారం చేసింది చంద్రబాబే అన్నారు. తనకు అధికారం, జగన్‌కు బెయిల్ రావొద్దనేదే బాబు ధ్యేయమన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రానికి బ్లాంక్ చెక్కు వంటి లేఖ ఇవ్వడం ద్వారా ఆయన ఈ రాష్ట్రాన్ని చీల్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.
కాంగ్రెసు పార్టీ అధినాయకత్వాన్ని ఢీకొట్టగల ఏకైక నాయకుడు జగన్ అని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు. ఆయన జగన్‌ను జైలులో కలిసిన అనంతరం మాట్లాడారు. తాను మూడున్నరేళ్లుగా జగన్ పార్టీతోనే ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో ఇదే పార్టీ తరఫున పోటీ చేస్తానన్నారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలన్న నాయకుడు జగన్ మాత్రమే అన్నారు. అథను త్వరలో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications