రిలాక్స్ అయ్యింది చాలు... ఇక అలెర్ట్ అవ్వండి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రవ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది. నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితం విడుదల కానున్న నేపథ్యంలో పార్టీ నేతలను చంద్రబాబు నాయుడు అలెర్ట్ చేశారు. మొన్నటివరకు అమెరికాలో పర్యటించి వచ్చిన చంద్రబాబు వచ్చిన తర్వాత నుండి పూర్తిస్థాయిలో బిజీ అయ్యారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ శ్రేణులతో సమీక్షలు జరుపుతున్నారు.
అభ్యర్థులను అలెర్ట్ చేసిన చంద్రబాబు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసిన మెజార్టీ అభ్యర్థులు కొందరు విదేశాలకు వెళితే, కొంతమంది ఇతర ప్రాంతాలలో పర్యటిస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఫలితాలకు ముందు రోజు తిరిగి రావాలని నిర్ణయించుకున్న వారు కూడా లేకపోలేదు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను, కూటమి నుండి పోటీ చేసిన అభ్యర్థులకు చంద్రబాబు ఫలితాలు నేపథ్యంలో అలెర్ట్ చేశారు.

నియోజకవర్గాలకు చేరుకోవాలన్న చంద్రబాబు
ఫలితాల సందర్భంగా ఏదైనా జరిగే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ తమ తమ నియోజకవర్గాలకు చేరుకోవాలని చంద్రబాబు అందరిని అలెర్ట్ చేస్తున్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చంద్రబాబు నొక్కి చెబుతున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలలోని అభ్యర్థులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కౌంటింగ్ సందర్భంగా శ్రేణులకు చంద్రబాబు సూచనలు
చంద్రబాబు సూచనలతో ఇప్పటికే అనేక నియోజకవర్గాలలోని అభ్యర్థులు తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో నియోజకవర్గాలలో సందడి వాతావరణం కనిపిస్తుంది. అయితే కౌంటింగ్ సందర్భంగా చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఎవరు తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని, పదే పదే టెన్షన్ వద్దని ఆయన టెలి కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు.
రిలాక్స్ అవుతున్న వారంతా అలెర్ట్ కావాల్సిన సమయం
కచ్చితంగా టిడిపి కూటమి విజయం సాధిస్తుందని ఇందులో సందేహం లేదని, అలాగని ఎవరూ నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించ కూడదని చంద్రబాబు సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లను ఎంపిక చేసుకోవడం, కౌంటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించడం వంటివి కచ్చితంగా చూడాలని పేర్కొన్నారు. మొత్తానికి కౌంటింగ్ నేపథ్యంలో ఇక రిలాక్స్ అయింది చాలు మళ్లీ రంగంలోకి దిగండి అంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు.












Click it and Unblock the Notifications