మొహమాటంతో శిక్షించకుండా క్షమించేశా: చంద్రబాబు ఆసక్తికరం
కడప: తాను మొహమాటంతో ఇన్నాళ్లు మిమ్మల్ని శిక్షించకుండా క్షమించానని, నా వేగాన్ని అందుకోవాలి, లేదంటే వెళ్లిపోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఓపిక పరీక్షిస్తే మీకే మంచిది కాదన్నారు.
పవన్ వద్ద ఫుల్‌స్టాప్: ఒక్కదెబ్బకు... మోడీ కదలిక వెనుక 2 కారణాలుఆయన గురువారం నాడు కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల పైన మండిపడ్డారు.
చంద్రబాబు రాయచోటిలోని కంచరపల్లిలో రైతులతో మాట్లాడారు. రాయలసీమను కరువురహిత ప్రాంతంగా చేస్తాన్నారు. పంటలను రక్షించుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. రాయచోటి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ఇకపై అన్ని పంటలను ప్రభుత్వం రక్షిస్తుందన్నారు.

కాగా, వర్షపాత అంతరాయాల్లో పంటలను కాపాడటంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రెయిన్‌గన్ సాంకేతికతతో వ్యవసాయ రంగంలో నూతన శకం ప్రారంభించామన్నారు.
రెయిన్ గన్స్‌తో రక్షక తడులు ఇచ్చి పంటలు కాపాడటం దేశంలోనే సరికొత్త చరిత్ర అని సీఎం వివరించారు. వర్షాలు లేకున్నా పంట కాపాడుకోవచ్చనే ధీమా, ధైర్యం రైతుల్లో వచ్చిందన్నారు. రైతుల్లో ధైర్యానికి కారణమైన అందరికీ అభినందనలు, ఇది నిజంగా అద్భుతం అని ప్రశంసించారు. నీళ్లులేక పంట ఎండిపోవడమనేది ఇకపై మన రాష్ట్రంలో జరగకూడదన్నారు.












Click it and Unblock the Notifications