పవన్ వద్ద ఫుల్‌స్టాప్: ఒక్కదెబ్బకు... మోడీ కదలిక వెనుక 2 కారణాలు
విజయవాడ: వారం రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రత్యేక హోదా పైన ప్రశ్నించడం, ఢిల్లీలో కదలిక రావడం... చర్చనీయాంశంగా మారింది. హోదా పైన పవన్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి కాకినాడ నుంచి తన ప్రశ్నించడం ప్రారంభించనున్నారు.
దీంతో, ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ పైన గతంలో కంటే భిన్నంగా కేంద్రం పావులు కదుపుతోంది. హోదా ఇవ్వదనే విషయం స్పష్టమైంది. కానీ, హోదాను మించిన సాయం చేస్తామని చెబుతోంది. హోదా అనే పేరు లేకుండా అలాంటి లేదా అంతకు మించి సాయం చేసే ప్రణాళికలు ఏపీ సిద్ధం చేస్తోంది.
హోదా లేదు, భారీ ప్యాకేజీ, అమరావతికి 5వేలకోట్లు: నో చెప్పిన బాబు, పవన్‌కు నో రెస్ట్!
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు కూడా ఇవ్వాలని తమిళనాడు, కర్నాటక, బీహార్, తెలంగాణ తదితర రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విభజన వల్ల ఆర్థికంగా చితికిపోయిన ఏపీకి ఆ కోణంలో కేంద్రం సాయం చేసే ఆలోచన చేస్తోంది. అలాగే పార్లమెంటులో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది.
వారు ప్రశ్నిస్తే అంతంత.. పవన్ ప్రశ్నకు మద్దతిస్తూ ప్యాకేజీపై కదలిక
ఇన్నాళ్లు ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్, కాంగ్రెస్ పార్టీలు హోదా కోసం ఉద్యమించినప్పుడు, ప్రశ్నించిప్పుడు కేంద్రం నుంచి ఎంతో కొంత స్పందన లేదా, ఏపీ బీజేపీ నేతల నుంచి ఎదురు దాడి కనిపించింది. ఇప్పుడు పవన్ విషయంలో మాత్రం ఎదురు దాడి బదులు, ఆయన మాటలను బలపర్చడమే కాకుండా, అంతకుమించి ప్యాకేజీ కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తుండం, అదీ మూడు నాలుగు రోజులుగా చర్చలు జరుపుతుండటం చర్చకు దారి తీసింది.
బీజేపీయే రంగంలోకి దింపిందా
పవన్ కళ్యాణ్ ప్రశ్నింంచడంతో కదలిక రావడంపై రాజకీయ వర్గాల్లో ప్రధానంగా దీనిపై చర్చ సాగుతోంది. ఇది బిజెపి - పవన్ కళ్యాణ్ మధ్య కుదుర్చుున్న అవగాహన మేరకేనా అనే చర్చ జరుగుతోంది. సాధారణంగా పవన్‌కు కాంగ్రెస్ అంటే పడదు. అలాంటి అభిప్రాయమే వైసిపి పైన ఉందనే వాదనలు ఉన్నాయి.

మిగిలింది బీజేపీయే. టిడిపి పట్ల కూడా సానుకూల వైఖరి ఉన్నా లేకున్నా బీజేపీకి అది మిత్రపక్షం. ఇన్నాళ్లు ప్రశ్నిస్తే పెద్దగా హడావుడి కనిపించలేదు. పవన్ ప్రశ్నించగానే మూడు నాలుగు రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయంటే బీజేపీయే రంగంలోకి దించిందా అనే ప్రశ్న ఉదయిస్తోందని అంటున్నారు.
ఎలాగు రెండున్నరేళ్లు గడిచాయి. చివరి ఏడాది అటోఇటో ప్రచారానికే సరిపోతుంది. ఈ నేపథ్యంలో మరో ఏడాదిన్నర మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో హోదా పైన ప్రజల నుంచి వచ్చిన విమర్శనను దాటుకొని, భారీ ప్యాకేజీ ద్వారా వారి మన్ననలు ఇదే సమయమని బీజేపీ భావించి ఉంటుందని అంటున్నారు.
ఓ వైపు పవన్‌కు గౌరవం, మరోవైపు ప్రజల కోరిక..
పవన్ కళ్యాణ్ ప్రశ్నించినప్పుడు కేంద్రంలో మరింత కదలిక రావడం వెనుక రెండు కారణాలున్నాయని అంటున్నారు. ఒకటి 2014లో తమకు మద్దతిచ్చిన పవన్ ప్రశ్నిస్తే దానిని సానుకూలంగా స్వీకరించడం ద్వారా ఆయనను గౌరవించినట్లవుతుంది. మరొకటి ఎలాగు ఏపీ ప్రజల్లో తమపై గూడుకట్టుకున్న ఆగ్రహాన్ని ఒక్క దెబ్బతో (హోదాను మించిన ప్యాకేజీ ద్వారా) తుడిచిపెట్టేలా చేయడం బీజేపీ వ్యూహం కావొచ్చని అంటున్నారు.
ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే
2019 ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల గడువే ఉంది. ఈ నేపథ్యంలో హోదా అంశంపై ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకవేళ పవన్ - బీజేపీ మధ్య అందరు అనుకున్నట్లుగా అవగాహన లేకపోయినా... అదేదో ఇప్పుడు పవన్ ప్రశ్నించినప్పుడు పెడితే... అది బీజేపీకి కూడా ప్లస్ అవుతుంది.
పవన్ మమ్మల్ని తిట్లేదు: బీజేపీ నేత, బాబు పిలిస్తేనే.. బోండాకు టీజీ కౌంటర్
ఈ కోణంలో బీజేపీ ఆలోచించి ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో హోదా అనేది సెంటిమెంట్ అంశం. దీనిని పవన్ ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లకముందే చర్యలు చేపడితే పార్టీకి నష్టం కంటే లాభం ఎక్కువ అని బీజేపీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు.
ఒకటి పవన్‌కు గౌరవం ఇచ్చినట్లు, రెండు కాంగ్రెస్ చేసిన పొరపాటుకు (చట్టంలో హోదాను పెట్టకపోవడం) అంతకుమించి ప్యాకేజీతో ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత లేకుండా చేయడం, అదేవిధంగా భారీ ప్యాకేజీల ద్వారా ఇటు టిడిపి, అటు ప్రతిపక్షాలకు అస్త్రం లేకుండా చేయడం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని.. ఇలా ఒక్కదెబ్బకు ఎన్నో కలిసివస్తాయని బీజేపీ భావిస్తుండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications