చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ వార్షికోత్సవం..ఒకరికొకరు ప్రేమ సందేశం.. సోషల్ మీడియాలో వైరల్!

ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి ల వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ దంపతులకు పార్టీ శ్రేణుల నుండి ప్రజల నుండి శుభాకాంక్షలు వెల్లువగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి దంపతులు 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రేమ సందేశాలు మార్పిడి చేసుకోగా, వారి సరదా సంభాషణ వైరల్ అయింది.

ముందుగా భువనేశ్వరి ట్వీట్ చేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారికి 45వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఇన్ని సంవత్సరాల స్నేహం, సాన్నిహిత్యం, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇచ్చిందని ఆ ట్వీట్ లో భువనేశ్వరి అన్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది వివాహ వార్షికోత్సవ ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? అని సోషల్ మీడియా వేదికగా చాలా సరదాగా, ప్రేమగా అడిగారు.

Chandrababu Bhuvaneswari bonding ap cm couple Love on 45th Wedding Anniversary viral on social media

దీనికి సీఎం చంద్రబాబు స్పందిస్తూ, హ్యాపీ యానివర్సరీ, భు.. అంటూ ప్రేమగా స్పందించారు. ఆ మెసేజ్ లో నన్ను అందరూ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు అని పిలవొచ్చు. కానీ నాకు అత్యంత ఇష్టమైన, నేను ఎంతో గర్వంగా భావించే భర్త అనే హోదాను ఇచ్చింది నువ్వు. నాకు భర్త హోదా ఇచ్చినందుకు ముందుగా నీకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

ఇన్ని సంవత్సరాలుగా ఒకే ఒక్క హామీ, ప్రమాణం ఆగిపోయింది. ఈ సుదీర్ఘ జీవిత ప్రయాణంలో నీతో కలిసి చివరివరకు అడుగులు వేయడమే" నా ప్రమాణం అంటూ అని చాలా ప్రేమ పూర్వకంగా రిప్లై ఇచ్చారు. వారిద్దరి సందేశాలను చూసిన వారు వారి బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అన్నది చర్చించుకుంటున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ బంధాన్ని కొనియాడుతున్నారు.

ఇక సీఎం చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి కూడా శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ అమ్మా, నాన్నా.. ప్రజా జీవితంలో, రాజకీయాల్లో, విజయాల్లో, సవాళ్లలో భాగస్వామ్యం అంటే ఏమిటో మీరిద్దరూ చూపించారు. మరెన్నో సంవత్సరాలు కలిసి నడవాలని ఆకాంక్షిస్తున్నాం అని రాశారు.

ఏపీకి కేంద్రం శుభవార్త.. ఈ కొత్త రైల్వే లైన్లతో చిత్తూరు, తిరుపతి జిల్లాలవారికి పండుగే!
ఏపీకి కేంద్రం శుభవార్త.. ఈ కొత్త రైల్వే లైన్లతో చిత్తూరు, తిరుపతి జిల్లాలవారికి పండుగే!

బ్రాహ్మణి కూడా 45 సంవత్సరాల ప్రేమ, వారి సరదా ప్రయాణాన్ని ప్రశంసిస్తూ విషెస్ చెప్పారు.కూటమి నేతలు, కార్యకర్తలు, నెటిజన్లు కూడా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు-భువనేశ్వరిల పరస్పర ప్రేమ, గౌరవం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. భార్యా భర్తలు అంటే ఇలాగే ఉండాలి అనేలా వారిద్దరూ ఎంతో మంది దంపతులకు స్పూర్తినిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+