మోడీని నమ్ముకుంటే ఏంచేయలేదు, రాహుల్ ప్రకటించారు, కలిసి పని చేద్దాం: బాబు ఆసక్తికరం

Recommended Video

    AP special status Protest : Rahul Gandhi joined

    అమరావతి: విభజన నేపథ్యంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో బీజేపీతో కలిస్తే ఏపీకి న్యాయం జరుగుతుందని తాను ఆ పార్టీతో కలిశానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రస్తావన లేకపోయేసరికి తాము ప్రశ్నించామన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పామన్నారు.

    చదవండి: ట్విస్ట్.. కర్నూలు రెండో రాజధానిగా ఓకే, కానీ: బీజేపీకి లోకేష్ దిమ్మతిరిగే షాక్

    రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించాయన్నారు. విభజన హామీలపై ఢిల్లీ నేతలతో చర్చలు జరుపుతున్నా అమలు కావడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి విభజన బిల్లులు పాస్ చేశాయన్నారు.

    చట్టం సరిగా లేదని బీజేపీ

    చట్టం సరిగా లేదని బీజేపీ

    చట్టం సరిగా లేదు కాబట్టి తాము విభజన హామీలు అమలు చేయలేకపోతున్నామని బీజేపీ చెబుతోందని చంద్రబాబు అన్నారు. విభజన హామీలను అమలు చేయాల్సిందే అన్నారు. రెండు జాతీయ పార్టీలు ప్రజలను పట్టించుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    రాహుల్ గాంధీ ప్రకటించారు

    రాహుల్ గాంధీ ప్రకటించారు

    ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ రోజు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాపై సంతకం చేస్తానని చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో హోదా కోసం ఏపీ ఎంపీలంతా కలిసి పోరాడుతున్నారని చెప్పారు. బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లవచ్చునని భావించానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఇలాంటి ప్రతిపక్షం దురదృష్టకరం

    ఇలాంటి ప్రతిపక్షం దురదృష్టకరం

    ఆనాడు తెలంగాణలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో కలిపితేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పానని చంద్రబాబు అన్నారు. అభివృద్ధికి అడ్డుపడే ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని వైసీపీని ఉద్దేశించి అన్నారు.పోలవరం ప్రాజెక్టును నీతిఅయోగ్ తమకు అప్పగించిందని చెప్పారు.

     ఏపీ కోసం అందరం కలిసి పోరాడుదాం

    ఏపీ కోసం అందరం కలిసి పోరాడుదాం

    పోలవరం పనులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయని చంద్రబాబు అన్నారు. స్పిల్ వే, కాఫర్ డ్యాం పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయని చెప్పారు. ఏపీ కోసం కోసం అందరం కలిసి పోరాడుదామని, కలిసి పని చేద్దామని చంద్రబాబు అన్నారు.

     నాలుగేళ్లుగా ఏం చేయలేదు

    నాలుగేళ్లుగా ఏం చేయలేదు

    కేంద్రం నాలుగేళ్లుగా ఏమీ చేయలేదని, అందుకే ఇప్పుడు పోరాడుతున్నామని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి పని చేశామని చెప్పారు. మనకు అన్యాయం జరిగింది కాబట్టే ఏపీ ఎంపీలంతా కలిసి పోరాటం చేస్తున్నారని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+