kesineni chinni versus kesineni nani: కేశినేని చిన్నికి అలా దొరికిన కేశినేని నాని..!
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య పోరు ముదురుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కేశినేని నాని చంద్రబాబు టార్గెట్ గా తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. దీంతో టికెట్ గ్యారంటీ లేకే జగన్ దగ్గర మెప్పు కోసం ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆయన సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కేశినేని నాని చేసిన విమర్శలపై చిన్ని ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు అసలు అభివృద్ధి చేయలేదంటూ తాజాగా కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు నాని ఘాటు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అభివృద్ధి చేయకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై ఎందుకు పోటీ చేశావంటూ ప్రశ్నించారు. నానికి సీటు గ్యారంటీలేకే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారని చిన్ని విమర్శించారు. చంద్రబాబు ను తిడితేనే సీటు ఇస్తారని ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు అరెస్టు సమయంలో కేశినేని నాని కోవర్డ్ ఆపరేషన్ చేశాడంటూ చిన్ని విమర్శించారు. చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్న కేశినేని నాని.. శిలా ఫలకాలపై ఎందుకు పేరు వేయించుకున్నాడో చెప్పాలని అడిగారు. కేశినేని నాని అనే వ్యక్తి ప్రజల్లో ఎప్పుడూ తిరిగాడో చెప్పాలన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి రాజకీయ పరిజ్ఞానం సున్నా అని చిన్ని విమర్శించారు. విజయవాడ నియోజకవర్గంలో పట్టుమని పది గ్రామాలు తెలియని వ్యక్తి విజయవాడ ఎంపీ అన్నారు.
మోడీ కాళ్ళు మొక్కింది విజయసాయిరెడ్డి అని కేశినేని చిన్ని గుర్తుచేశారు. జగన్ రెడ్డి కోర్టు కేసులు మాఫీ కోసం మోడీని కాకా పట్టారన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసమే బీజేపీతో పొత్తు అన్నారు. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. కేంద్రం సహకారం ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, కానీ రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధి కోసం ఎన్టీయేతో కలిసి పనిచేస్తామని చెప్పారని చిన్ని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications