చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భయపడ్తూ చెప్పారు, అనురాధ నన్నడగలేదు: బాబు (పిక్చర్స్), చింటూ ఎక్కడ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జిల్లాలోనే కాకుండా, మొత్తం రాయలసీమలోనే ముఠా కక్షలను, రౌడీయిజాన్ని సహించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. దారుణ హత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. హత్యా రాజకీయాలను సహించమన్నారు. అనురాధ దంపతుల హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులను, ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. మేయర్ అనురాధ చాంబరులోనే ప్రాణాలు విడిచారని, మోహన్‌ను బతికించుకునేందుకు ప్రయత్నించామన్నారు. వైద్యులతో నేను కూడా మాట్లాడానని చెప్పారు. అయినా బతికించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల్లో ఉండే నాయకులు ఏమరుపాటుగా ఉండవద్దన్నారు. బంధుత్వం ఉండటాన్ని ఉపయోగించుకొని దుండగులు క్రూరంగా ప్రవర్తించారని పరోక్షంగా చింటూ అలియాస్ చంద్రశేఖర్ పైన మండిపడ్డారు. అయితే, హత్య విషయమై అన్ని కోణాల్లో విచారించవలసి ఉందన్నారు.

దుండగులు బయటి నుంచి వచ్చారా, తుపాకులు ఎక్కడి నుంచి తెచ్చారు... అనేది తేలాల్సి ఉందన్నారు. మేయర్ గన్‌మెన్‌ను తిరస్కరించిన అంశంపై ప్రశ్నించగా.. గన్‌మెన్ రక్షణ గురించి తనకు తెలియదన్నారు. తన దృష్టికి వచ్చి ఉంటే ఆలోచించేవాళ్లమన్నారు. ముఠా కక్షలపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు.

చిత్తూరులో మొదటి నుంచీ రౌడీయిజం, హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు పోరాటాలు చేశామని, సంఘ విద్రోహశక్తుల పట్ల పోలీసు నిఘా పెంచి కఠినంగా వ్యవహరించినట్లు చంద్రబాబు వెల్లడించారు.

అనురాధ దంపతులు

అనురాధ దంపతులు

చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల మృతదేహాలు.

అనురాధ దంపతులు

అనురాధ దంపతులు

చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులు.

అనురాధ దంపతులు

అనురాధ దంపతులు

చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల భౌతిక కాయానికి గాలి ముద్దుకృష్ణమ నాయుడు నివాళులు.

అనురాధ దంపతులు

అనురాధ దంపతులు

చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన నారా లోకేష్.

అనురాధ దంపతులు

అనురాధ దంపతులు

చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల మృతదేహాలు.

అనురాధ దంపతులు

అనురాధ దంపతులు

చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల భౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పించారు.

అనురాధ దంపతులు

అనురాధ దంపతులు

చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల భౌతిక కాయాన్ని చూసేందుకు తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు.

అనురాధ దంపతులు

అనురాధ దంపతులు

చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల భౌతిక కాయాలను స్మశాన వాటికకు తరలిస్తున్న దృశ్యం.

అనురాధ దంపతులు

అనురాధ దంపతులు

చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల భౌతికకాయాలు ప్రజల సందర్శనార్థం ఉంచిన దృశ్యం.

భయపడుతూ చెప్పారు

తాము బయట స్వేచ్ఛగా ఎలా తిరగగలమని పలువురు కార్పొరేటర్లు భయపడుతూ తనకు చెప్పారని, అలాంటి రౌడీయిజాన్ని పూర్తిగా రూపుమాపాల్సిన అవసరముందన్నారు. భద్రత కావాలని మేయర్‌ అనురాధ కోరలేదని, తన దృష్టికి వచ్చిఉంటే తప్పకుండా పరిశీలించేవారమన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు అంగరక్షకులు, తుపాకులిచ్చినంత మాత్రాన సమస్య తీరిపోదని, ప్రతి ఒక్కరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.

పోలీసులపై అసహనం

అనురాధ, మోహన్ హత్య నేపథ్యంలో పోలీసులు అధికారులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. పట్టపగలు తుపాకులు, కత్తులు పట్టుకొని వచ్చి దాడులు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారని సమాచారం.

అనురాధ దంపతుల హత్య జరిగిన కార్పోరేషన్ కార్యాలయాన్ని చంద్రబాబు సందర్శించారు. అక్కడే రాయలసీమ ఐజీ గోపాలకృష్ణ, డిఐజీ సత్యనారాయణ, ఎస్పీ శ్రీనివాస్‌లతో సమావేశమయ్యారు. హత్యా రాజకీయాలు చేసే వారిని తుంచివేయాలన్నారు. హత్య జరిగి 24 గంటలు గడిచినా ప్రధాన నిందితులను ఎందుకు పట్టుకోలేదన్నారు.

నేను ఉన్నానని, మీరు భయపడవద్దని మేయర్ అనురాధ పిల్లలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఓదార్చారు. హత్యాస్థలి కార్యాలయంలోని మేయర్ చాంబరులో చంద్రబాబు కొంతసేపు గడిపారు. ఆ సమయంలో మేయర్ పిల్లలను పిలిపించుకొని మాట్లాడారు.

ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని ఓదార్చారు. మరోవైపు, చింటూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను ఎక్కడున్నాడో తెలియడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అతను పోలీసుల అదుపులో ఉన్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

English summary
Chief Minister Chandrababu Naidu expressed shock and condemned the murder of party leader and Chittoor Mayor K Anuradha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X