వరదల సమయంలో చంద్రబాబు సంపద సృష్టి.. వైసీపీ టార్గెట్, టీడీపీ కౌంటర్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ను వరదలు ముంచెత్తాయి. విజయవాడలోని అనేక కాలనీలు నీట మునిగాయి. దీంతో విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడానికి రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం ఒక వైపు బోట్లు, మరొకవైపు హెలికాప్టర్లు, ఇంకోవైపు డ్రోన్ల సహాయంతో నిరంతరం వారికి కావలసిన ఆహారాన్ని, తాగునీటిని, మందులను సరఫరా చేస్తోంది.

సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైన మంత్రులు, అధికారులు
ముంపు కు గుగురైన ప్రాంతాలలో ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించి సహాయ కార్యక్రమాలను అధికారులు, మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత తదితర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు సహాయ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు.

Chandrababu creation of wealth with heritage milk during floods YCP target TDP counter

వరదల వేళ హెరిటేజ్ పాల ప్యాకెట్ పై వీడియో వైరల్
ఇదిలా ఉంటే ఏపీలో వరదలలో చిక్కుకున్న వారికి ఎలాంటి సహాయం అందడం లేదని కనీసం మంచినీళ్లు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారు ఎంతోమంది ఎన్నో కాలనీలలో చిక్కుకున్న వారు ఉన్నారని వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా హెరిటేజ్ పాల ప్యాకెట్ 350 రూపాయలకు అమ్ముతున్నారని ఒక వీడియోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

వైసీపీకి ఘాటుగా బదులిచ్చిన టీడీపీ
హెరిటేజ్ పాల ప్యాకెట్ 350 రూపాయలకు అమ్మి సంపద సృష్టిస్తున్న చంద్రబాబు అంటూ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.దీంతో తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వైసీపీకి ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. జనం సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఎగ్ పఫ్ లలా మేసేసిన దొంగ జగన్ బ్యాచ్ వరద బాధితుల సహాయం పై విష ప్రచారం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు.

కృష్ణలంక రిటైనింగ్ వాల్ పైన సోషల్ మీడియాలో రగడ
బాధితులకు ఆహారం, పాలు, నీళ్లు ఉచితంగా ఇళ్ల వద్దకే నేరుగా ప్రభుత్వం పంపిణీ చేస్తోందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న కృష్ణలంక దగ్గర కృష్ణా నది పక్కన రిటైనింగ్ వాల్ విషయంలో కూడా రెండు పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరిగింది. ఆ రిటైనింగ్ వాల్ జగన్ కట్టించడం వల్లే కృష్ణలంక తదితర ప్రాంతాల ప్రజలు తీవ్రముంపుకు గురికాలేదని వారంతా జగన్ కు ధన్యవాదాలు చెబుతున్నారని వైసిపి పోస్ట్ చేసింది.

ఏపీ ప్రభుత్వం ఫెయిల్ అని వైసీపీ ప్రచారం.. తిప్పికొడుతున్న టీడీపీ
దీంతో ఆ రిటైనింగ్ వాల్ 2019లో చంద్రబాబు హయాంలోనే నిర్మాణం పూర్తి చేసుకుందని మనం అబద్ధం చెప్పిన గూగుల్ అబద్ధం చెప్పదంటూ నాటి వీడియోను పోస్ట్ చేసి ఆ రిటైనింగ్ వాల్ కట్టించిన ఘనత చంద్రబాబు దేనని స్పష్టం చేసింది టిడిపి. ఏపీలో వరదలు కొనసాగుతున్న సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఓవైపు సహాయక చర్యలపైన అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నవేళ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతుంది. వైసిపి వరదల సాయంలో ప్రభుత్వం ఫెయిల్ అని చేస్తున్న ప్రచారాన్ని టిడిపి తిప్పికొట్టే పని చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+