వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యామిలీతో లీడర్: సావధానంగా వింటూ లోకేష్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమన్యాయం పేరుతో న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమరణ నిరీహార దీక్ష కొనసాగుతోంది. గురువారం ఆయన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. బుధవారం దీక్షలో తనయుడు నారా లోకేష్, సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు న్యాయం జరిగేవరకూ ఢిల్లీ వీడేది లేదని, అప్పటి వరకూ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తెలుగు జాతిపై కక్ష తీర్చుకోవద్దని, విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అస్సాం గణపరిషత్ అధ్యక్షుడు ప్రఫుల్ల కుమార్ మహంత తదితరులు దీక్షా శిబిరానికి వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలిపారు.

అయితే, ఎపి భవన్ నుంచి చంద్రబాబును తొలగించాలంటూ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ కేంద్ర హోం శాఖను కోరుతూ ఒక లేఖ రాశారు. దీంతో సోనియా, కాంగ్రెస్ పార్టీ, రెసిడెంట్ కమిషనర్లపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తెలుగువారంటే ఢిల్లీకి ఎప్పుడూ చులకనేనని విమర్శించారు. తెలుగువారి సత్తా, ఆత్మగౌరవం ఏమిటో తెలుగు ప్రజలే సోనియా గాంధీకి చూపిస్తారని మండిపడ్డారు.

నారా లోకేష్

నారా లోకేష్

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ న్యూఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో ముచ్చటిస్తున్న తనయుడు నారా లోకేష్.

భువనేశ్వరి, బ్రాహ్మణి

భువనేశ్వరి, బ్రాహ్మణి

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ న్యూఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వద్ద బ్రాహ్మణి, భువనేశ్వరి.

సోనియా డౌన్ డౌన్

సోనియా డౌన్ డౌన్

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ న్యూఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి దీక్షా ప్రాంగణం వద్ద సోనియాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీ. రాక్షసిగా చిత్రీకరించి ఆమె మెడలో నేతల ఫోటోలు ఉంచారు.

భువనేశ్వరితో

భువనేశ్వరితో

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ న్యూఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరితో మాట్లాడుతున్న దృశ్యం.

లోకేష్‌తో బ్రాహ్మణి, భువనేశ్వరి

లోకేష్‌తో బ్రాహ్మణి, భువనేశ్వరి

చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీకి వచ్చిన నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరిలు ఎపి భవన్లో కూర్చొని ముచ్చటిస్తున్న దృశ్యం.

చంద్రబాబు - 1

చంద్రబాబు - 1

తన ఆరోగ్యం చెడిపోయినా, ప్రాణం పోయినా దీక్షను ఆబోనని, తెలుగు ప్రజలపై సోనియా పెత్తనం నడవదని చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబు 2

చంద్రబాబు 2

రాష్ట్రం గురించి చర్చలు జరిపేందుకు, సంప్రదించేందుకు తెలుగువారిలో ఒక్క నాయకుడూ లేరా? ఒక పెద్ద మనిషీ లేరా? అని బాబు ప్రశ్నించారు. పేపర్ చదువుతున్న దృశ్యం.

చంద్రబాబు 3

చంద్రబాబు 3

బాబు దీక్షకు పలువురు నేతలు మద్దతు పలికారు. అస్సాం గణపరిషత్ అధ్యక్షుడు ప్రఫుల్లకుమార్ మహంత కూడా దీక్షా శిబిరానికి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

చంద్రబాబు 4

చంద్రబాబు 4

బాబు దీక్షకు పలువురు నేతలు మద్దతు పలికారు. అస్సాం గణపరిషత్ అధ్యక్షుడు ప్రఫుల్లకుమార్ మహంత కూడా దీక్షా శిబిరానికి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

చంద్రబాబు 5

చంద్రబాబు 5

తెలుగు ప్రజలకు న్యాయం జరిగేవరకూ ఢిల్లీ వీడేది లేదని, అప్పటివరకూ పోరాటం చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

చంద్రబాబు 6

చంద్రబాబు 6

దేశ దశ, దిశ మార్చిన పీవీ నరసింహారావు చనిపోతే ఆయన మృతదేహాన్ని ఏఐసీసీకి కూడా తీసుకెళ్లలేదని, ఢిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయలేదని, కనీసం మృతదేహం కూడా సరిగా కాల్చలేదని గుర్తు చేశారు. దీక్షా ప్రాంగణంలో బాబు ఫ్లెక్సీ.

తనయుడితో

తనయుడితో

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ న్యూఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్‌తో మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

న్యూఢిల్లీలోని ఎపి భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నుండి చాలామంది వెళ్లారు.

చంద్రబాబు 7

చంద్రబాబు 7

ఎపి భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నీరసించి పడుకున్న దృశ్యం.

చంద్రబాబు 8

చంద్రబాబు 8

న్యూఢిల్లీలోని ఎపి భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నుండి చాలామంది వెళ్లారు.

చంద్రబాబు 9

చంద్రబాబు 9

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్న ఇద్దరు వైద్యులు.

English summary
TDP chief Chandrababu Naidu, now on the fourth day of a hunger strike in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X