ఇదీ పరిస్థితి!: ప్రధానికి చెప్పేందుకు ఢిల్లీకి చంద్రబాబు

ఇందుకోసం ఆయన ఇరు ప్రాంతాల నేతలతో శనివారం వేర్వేరుగా భేటీ అయ్యారు. సీమాంధ్ర నేతల సమావేశంలో యనమల రామకృష్ణుడు, కెఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన రావు, పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద్, సుజనా చౌదరి, సిఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నేతల సమావేశంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి, నామా నాగేశ్వర రావు, ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, రమేష్ రాథోడ్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం గురించి ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల నేతలకు చెప్పాలన్న అభిప్రాయం సీమాంధ్ర నేతలు సమావేశంలో వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతాల ప్రజలను కూర్చోబెట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని అన్ని జాతీయ పార్టీల నాయకులను తెలియజేయాలని చెప్పారు. తెలంగాణ నేతల సమావేశంలోను తెలంగాణకు అనుకూలంగా ఉంటూనే, సమస్య పరిష్కారానికి జాతీయ పార్టీలను, ప్రజా సంఘాలను కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.












Click it and Unblock the Notifications