చంద్రబాబు మరో ఢిల్లీ టూర్-ఆ రెండు ప్రాజెక్టులకు మోక్షం ?

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ టూర్ కు సిద్దమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీతో పాటు ఇతర కేంద్రమంత్రుల్ని తరచుగా కలుస్తున్నారు.అలాగే ఈ చర్చల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను నెరవేర్చుకున్నారు కూడా. దీంతో చంద్రబాబు ఈసారి ఢిల్లీ టూర్ పైనా చర్చ జరుగుతోంది. ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రెండు, మూడు కీలక అంశాలపై ప్రతిపాదనలు పెట్టడంతో పాటు పెండింగ్ లో అంశాలపై చర్చిస్తారు.

ఈ నెల 7న సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఇలాగే రైల్వే మంత్రి అమిత్ షా, జల్ శక్తి మంత్రితోనూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు అమరావతి రాజధాని, పోలవరం, విశాఖ రైల్వే జోన్ పై వీరితో చర్చించేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు.

Chandrababu delhi tour on oct 7 to discuss imf loan to Amaravati vizag railway zone

చంద్రబాబు ఢిల్లీ టూర్ లో అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంక్ నిధులపై చర్చిస్తారు. ఇప్పటికే రాజధానికి కేంద్రం గ్యారంటీతో రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు ప్రధాని మోడీ, అమిత్ షాతో చర్చించే అవకాశాలున్నాయి. అలాగే విశాఖ రైల్వే జోన్ శంఖుస్థాపన ముహుర్తంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో చంద్రబాబు చర్చిస్తారు. దీంతో పాటు రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైనా చర్చలు జరపబోతున్నారు. వీటిలో అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు, రైల్వే జోన్ శంఖుస్థాపన ఖాయంగా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+