చంద్రబాబు ఎన్నికల పాలిట్రిక్స్: బాబుతో పాటు లోకేష్, భువనేశ్వరి అందరూ బిజీనే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న విషయం తెలిసిందే . ఏపీలో ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఒకపక్క కలిసి వచ్చే పార్టీలతో సఖ్యంగా పనిచేస్తూనే మరోపక్క కుటుంబసభ్యుల సభ్యులను కూడా రంగంలోకి దించారు.
చంద్రబాబు పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబుతో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలతో చంద్రబాబు, ఇప్పటికే యువ గళం పాదయాత్ర చేసి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించనున్న లోకేష్, నిజం గెలవాలి పరామర్శ యాత్రలతో భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. దీంతో ఒకసారిగా చంద్రబాబు కుటుంబం ఫుల్ బిజీగా మారినట్టుగా తెలుస్తుంది.

ఈనెల ఐదవ తేదీ నుండి 29వ తేదీ వరకు చంద్రబాబు వరుసగా బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. మొత్తం 24 రోజుల్లో 25 బహిరంగ సభలలో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ ని కూడా విడుదల చేశారు. మరోవైపు లోకేష్ కూడా ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో గెలుపు లక్ష్యంగా పెట్టుకొని నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు.
సంక్రాంతి పండుగ వరకు మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో లోకేష్ పర్యటించనున్నారు. స్థానిక నాయకులు, కేడర్ తో మండలాల వారీగా లోకేష్ సమీక్షలు జరిపి వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు కోసం రంగంలోకి దిగిన నారా భువనేశ్వరి కూడా చంద్రబాబు అరెస్టు తర్వాత కొనసాగించిన నిజం గెలవాలి యాత్రను తిరిగి మళ్లీ కొనసాగించనున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక కొందరు అభిమానులు, మద్దతుదారులు మరణించిన క్రమంలో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే మరణించిన వారి కొన్ని కుటుంబాలను నిజం గెలవాలి యాత్ర పేరుతో పరామర్శించిన భువనేశ్వరి ఆపై చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో ఆ కార్యక్రమానికి బ్రేక్ వేశారు.

ఇప్పుడు తాజాగా మళ్లీ నిజం గెలవాలి యాత్ర ద్వారా భువనేశ్వరి కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి చంద్రబాబు కోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేసి టిడిపి వారి కుటుంబాలకు మద్దతుగా ఉంటుందని చెప్పనున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో చంద్రబాబు ఫ్యామిలీ మొత్తం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నంలో బాబు కుటుంబం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వచ్చే ఎన్నికలు నిర్ణయిస్తాయి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications