తెలంగాణ, జగన్: ఢిల్లీలో బాబుకి మద్దతు లభించిందా?

తన పర్యటనలో చంద్రబాబు జాతీయ పార్టీ నేతలతో ప్రధానంగా రాష్ట్ర విభజన అంశాన్ని చర్చించారు. అయితే, పలువురు నేతల నుండి ఆయనకు ఓదార్పు మౌఖికమైన మద్దతు మాత్రమే లభించిందని, గట్టి మద్దతు లభించలేదంటున్నారు. సిడబ్ల్యూసి విభజన నిర్ణయంపై జోక్యం చేసుకోవాలని కోరారట.
అందుకు పలువురు జాతీయ పార్టీ నాయకులు తాము తెలంగాణ విషయంలో పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు స్పందిస్తామని, ఇప్పుడు ఏమీ మాట్లాడలేమని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బాబు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను అడ్డుకోవడానికే ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపించారు.
జగన్ బెయిల్ అడ్డుకునేందుకు వెళ్లిన చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు. న్యాయం తమ వైపున ఉందని, అందుకే జగన్‌కు బెయిల్ వచ్చిందన్నారు. కాగా, జగన్ బెయిల్‌ను కాంగ్రెసు పార్టీ స్వాగతించగా, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. బిజెపి కూడా కాంగ్రెసుతో లాలూచీ కారణంగానే బెయిల్ వచ్చిందని ఆరోపించింది.












Click it and Unblock the Notifications