ఒంగోలు ఎంపీ సీటుపై చంద్రబాబు ట్విస్ట్-ఈసారి టీడీపీ అభ్యర్ధి ఆయనే..!
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్ధానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధి ఖరారయ్యారు. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబంలోనే ఈ సీటు దక్కుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో అందులో స్వల్ప మార్పు జరిగింది. ఈ మేరకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో మాగుంట కుమారుడు రాఘవరెడ్డి ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఒంగోలు టీడీపీ నుంచి ఓ సీనియర్ ఎంపీ ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంతో పాటు కేంద్ర పథకాలు రాష్ట్రంలో సమర్ధవంతంగా అమలవుతాయనే ఉద్దేశంతో ఈసారి కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డినే పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు ఆయన కుమారుడు రాఘవరెడ్డి వెల్లడించారు. ఈసారి కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డినే పోటీ చేయిస్తే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మంచిందని చెప్పడంతో ఆయనే పోటీ చేయబోతున్నట్లు కుమారుడు రాఘవ వెల్లడించారు.

ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరోసారి తన తండ్రి శ్రీనివాసులరెడ్డే అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నట్లు రాఘవరెడ్డి వెల్లడించారు. కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, ప్రజలు, మాగుంట అభిమానులు తన తండ్రి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎప్పటిలాగే తాను యువతకు, నాయకులకు, ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటూ ఒంగోలు పార్లమెంటు వినూత్న అభివృద్ధికి, యువకుల ఆశయాలకు అనుగుణంగా తన వంతు కృషి కొనసాగిస్తానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications