ఆ పాపమే జగన్‌ను చుట్టుకుంది: బాబు(పిక్చర్స్)

కడప: రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు తెప్పించడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అందులో భాగంగా గండికోటకు ఈ ఏడాది జూలై, ఆగష్టు లోగా 70 టిఎంసిల నీరు తెస్తామన్నారు. శుక్రవారం కడప జిల్లా కొండాపురం మండలం గండికోట సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

గండికోట ప్రాజెక్టు పూర్తికి రూ.600 కోట్లు సమకూర్చుతున్నామన్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని సీమకు మళ్లిస్తామన్నారు. గాలేరు నగరి, హంద్రీనీవాకు సమృద్ధిగా నీరు తీసుకువస్తామన్నారు. 1996లో తన హయాంలోనే గాలేరు నగరికి పునాది పడిందన్నారు. తిరిగి తమ హయాంలోనే నీరు తెప్పిస్తామని హామీ ఇచ్చారు. చిత్రావతి నీటిని పులివెందులకు మళ్లించి ఈ ప్రాంతం సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. సీమలో కరవును పారద్రోలి సస్యశ్యామలం చేస్తామన్నారు.

గండికోట, చిత్రావతి, గాలేరు నగరి, వామికొండ రిజర్వాయర్, పోతిరెడ్డిపాడు, సర్వారాయసాగర్ ప్రాజెక్టు, తెలుగుగంగ, కెసి కెనాల్‌కు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న తలంపుతో తాముంటే ప్రతిపక్ష నేత అభివృద్ధికి సహకరించాల్సింది పోయి నీటి విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.

ఆ పాపం జగన్‌కు చుట్టుకుంది

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి ధనయజ్ఞంగా మార్చారని ఆరోపించారు. ఆపాపం జగన్‌మోహన్‌రెడ్డికి చుట్టుకుందన్నారు. సిబిఐ, కేంద్రశాఖలు జగన్ అవినీతి అక్రమాలను నిర్ధారించి రూ. 230 కోట్ల ఆస్తులను అటాచ్‌మెంట్ చేశాయన్నారు. విభజన అనంతరం తలెత్తిన సమస్యలను అధిగమిస్తున్నామన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి గండికోట రిజర్వాయర్‌ను ఏరియల్ సర్వే చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు తెప్పించడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అందులో భాగంగా గండికోటకు ఈ ఏడాది జూలై, ఆగష్టు లోగా 70 టిఎంసిల నీరు తెస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

శుక్రవారం కడప జిల్లా కొండాపురం మండలం గండికోట సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అంతకుముందు ముఖ్యమంత్రి గండికోట రిజర్వాయర్‌ను ఏరియల్ సర్వే చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

గండికోట ప్రాజెక్టు పూర్తికి రూ.600 కోట్లు సమకూర్చుతున్నామన్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని సీమకు మళ్లిస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

గాలేరు నగరి, హంద్రీనీవాకు సమృద్ధిగా నీరు తీసుకువస్తామన్నారు. 1996లో తన హయాంలోనే గాలేరు నగరికి పునాది పడిందన్నారు. తిరిగి తమ హయాంలోనే నీరు తెప్పిస్తామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

చిత్రావతి నీటిని పులివెందులకు మళ్లించి ఈ ప్రాంతం సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. సీమలో కరవును పారద్రోలి సస్యశ్యామలం చేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈఏడాది ఇప్పటి వరకు 36 శాతం వర్షపాతం మాత్రమే నమోదైందన్నారు. భూగర్భజలాలు రోజురోజుకూ పాతాళానికి చేరుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

పులివెందులకు చిత్రావతి నుండి 1 టిఎంసి నీరు తెప్పించిన ఘనత తమదేనన్నారు. రాష్ట్రంలోని నదులను అనుసంధానం చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కుందూ - పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

గండికోట, చిత్రావతి, గాలేరు నగరి, వామికొండ రిజర్వాయర్, పోతిరెడ్డిపాడు, సర్వారాయసాగర్ ప్రాజెక్టు, తెలుగుగంగ, కెసి కెనాల్‌కు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న తలంపుతో తాముంటే ప్రతిపక్ష నేత అభివృద్ధికి సహకరించాల్సింది పోయి నీటి విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.

చంద్రబాబు

చంద్రబాబు

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి ధనయజ్ఞంగా మార్చారని ఆరోపించారు. ఆపాపం జగన్‌మోహన్‌రెడ్డికి చుట్టుకుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+