కొడాలి నాని పేకాట వ్యాఖ్యలపై చంద్రబాబు ధ్వజం .. చెప్పటానికి మంత్రికి , వినటానికి సీఎం జగన్ కు సిగ్గుండాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ పేకాట వ్యవహారం రచ్చగా మారింది. పవన్ కళ్యాణ్ గుడివాడ ఎమ్మెల్యే కు పేకాట స్థావరాలపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగు చేయడం పై లేదని చేసిన వ్యాఖ్యల తర్వాత, పేకాట స్థావరాలపై దాడులు జరగడం, ఆ దాడులలో ఎమ్మెల్యే కు సంబంధించిన వారు పట్టుబడడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది. అయితే పేకాట వ్యవహారంపై నిన్ను స్పందించిన కొడాలి నాని పేకాట ఆడితే ఏమవుతుంది? ఏం ఉరి వేస్తారా ? ఫైన్ కట్టి బయటకు వస్తారు. పేకాట ఆడిన వాళ్ళలో నా అనుచరులు ఉంటే తప్పా ? అంటూ చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Recommended Video

    Andhra Pradesh : కొడాలి నాని ని బర్త్ రఫ్ చేయాలి - టిడిపి | Kodali Nani రియాక్షన్
    రాష్ట్రంలో మంత్రులు ఒకరు బెట్టింగ్, హవాలా, పేకాట, మరొకరు బూతుల మంత్రి

    రాష్ట్రంలో మంత్రులు ఒకరు బెట్టింగ్, హవాలా, పేకాట, మరొకరు బూతుల మంత్రి

    పేకాట ఆడించి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మంత్రి పేకాట ఆడితే ఏమవుతుంది అంటున్నారు. జరిమానా కట్టి బయటకు వస్తారు అని చెప్పడానికి మంత్రికి గాని, ఆ మాటలు వినడానికి ముఖ్యమంత్రికి గానీ సిగ్గు ఉండాలి అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు ఒకరు బెట్టింగ్, ఒకరు హవాలా, ఒకరు పేకాట, మరొకరు బూతుల మంత్రి అంటూ విమర్శించిన చంద్రబాబు ఇలాంటి మంత్రులు ఏపీకి ఉండటం ప్రజల దౌర్భాగ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    గుడివాడ పేకాట స్థావరాలపై షాకింగ్ విషయాలు

    గుడివాడ పేకాట స్థావరాలపై షాకింగ్ విషయాలు

    ఇదే సమయంలో గుడివాడ పేకాట స్థావరాలపై గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెరువుగట్టులను కాసినోలు గా మార్చి పేకాటరాయుళ్ళు లక్షల రూపాయల పందాలు నిర్వహిస్తున్నారని, ఇక వీరు నిర్వహిస్తున్న పేకాట దందాకు పోలీసుల సపోర్ట్ కూడా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ నిర్వహిస్తున్న పేకాట స్థావరాలలో ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎంట్రీ ఫీజు పెట్టి మరీ మద్యం ,బిర్యానీ వారికి అందిస్తూ పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారు అంటే ఎంత పెద్ద ఎత్తున దందా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

    మంత్రి హోదాలో నానీ బాధ్యతారాహిత వ్యాఖ్యలు ... మండిపడిన చంద్రబాబు

    మంత్రి హోదాలో నానీ బాధ్యతారాహిత వ్యాఖ్యలు ... మండిపడిన చంద్రబాబు

    ఏపీ మంత్రి కొడాలి నాని మంత్రి హోదాలో ఉండి పేకాట ఆడిన వారిలో తమ అనుచరులు ఉంటే ఏమవుతుంది? కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి బయటకు వస్తారు ? అని వ్యాఖ్యానించడం పేకాట ఆడటం కామన్ అన్న భావన కలిగిస్తుంది . అది పెద్ద నేరం కాదు, ఫైన్ వేసి వదిలేస్తారు అన్న చందంగా నానీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు నాయుడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+