అమరావతి రైతులకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్-సెప్టెంబర్ 15న..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతున్న అమరావతి రైతులకు వరుసగా శుభవార్తలు చెబుతోంది. ఇప్పటికే అమరావతి రైతులకు గతంలో కేటాయించిన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర సాయం కూడా అందిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన ఓ అంశానికి సంబంధించి ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
అమరావతి రైతులకు ఏటా ఇవ్వాల్సిన కౌలును విడుదల చేసే విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఐదేళ్లుగా ప్రతీ ఏడాదీ కౌలు కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతులకు ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా నేరుగా కౌలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. వచ్చే నెల 15 కల్లా అమరావతి రైతులుక ఇవ్వాల్సిన వార్షిక కౌలును విడుదల చేస్తామని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ సమాచారం ఇచ్చారు.

అమరావతి రైతులకు ఈ ఏడాది ఇవ్వాల్సిన కౌలు మొత్తాన్ని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు మున్సిపల్ మంత్రి నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రైతుల సమస్యల పరిష్కారానికి సైతం సిద్దంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో వచ్చే నెల 15 కల్లా రైతుల ఖాతాల్లో నేరుగా ఈ కౌలు మొత్తం జమ కానుంది. గతంలో అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏటా వార్షిక కౌలును ప్రభుత్వం చెల్లిస్తోంది.












Click it and Unblock the Notifications