AP Employees: ఉద్యోగులకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల విషయంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు.. తాజాగా ఓ కీలక అంశంపై ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బదిలీలపై నిషేధం ఎత్తివేతపై ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీటిలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో వాటిలో మరో మార్పు ప్రకటించారు.
రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగుల బదిలీపై ఉన్న నిషేధాన్ని గత నెల 19 నుంచి 31 వరకూ ఎత్తేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేయడంలో ఆలస్యం కావడంతో ఆ గడువును ఈ నెల మొదటివారానికి పెంచారు. రాష్ట్రంలో ఓవైపు వరద సహాయక చర్యల్లో ఉద్యోగులు ఉండటంతో మరోసారి ఉద్యోగుల బదిలీలపై ఇచ్చిన గడువును మరోసారి పొడిగించారు.

ఏపీలో ఎక్సైజ్ మినహా మిగిలి శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ఇచ్చిన గడువును ఈ నెల 22 వరకూ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల కాగా.. మిగిలిన శాఖల్లో బదిలీలకు ఆయా శాఖలు మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి. వీటి ప్రకారం ఈ నెల 22 వరకూ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం సెప్టెంబర్ 23 నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. ఎక్సైజ్ శాఖకు మాత్రం ఈ నెల 30 వరకూ బదిలీల గడువు పొడిగించారు. వీరికి అక్టోబర్ 1 నుంచి బదిలీపై నిషేధం అమల్లోకి వస్తుంది.












Click it and Unblock the Notifications