AP Floods: వరద సాయం అకౌంట్లో పడలేదా ?-ఇది మీ కోసమే..!
ఏపీలో తాజా వరదలతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీటిలో వేల సంఖ్యలో బాధితులుగా మారిపోయారు. వీరికి ఇప్పటికే ప్రభుత్వం వరద సాయం ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో ఈ సాయం అందిస్తోంది. బాధితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ సాయం అందిస్తున్నారు. అయితే ఇలా బ్యాంకుల్లో నేరుగా సాయం అందుకోలేని వారు కడా ఉంటున్నారు. మ్యాపింగ్ కాని వారికి ఇలా జరుగుతోంది. దీంతో వీరి విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
మ్యాపింగ్ సహా వివిధ కారణాలతో బ్యాంకు ఖాతాల్లో వరద సాయం జమ కాని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు వీరికి నేరుగా ఇళ్ల వద్దే ఈ సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో వరద బాధితుల ఇళ్ల వద్దకు సచివాలయ సిబ్బంది వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన మేరకు సాయం మొత్తం అందించనున్నారు. దీంతో వరద బాధితుల కష్టాలు కొంతమేర అయినా తొలగుతాయని భావిస్తున్నారు.

మరోవైపు వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు స్పందనగా ఇప్పటివరకూ రూ.569 కోట్ల మేర మొత్తం జమ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కేంద్రం నుంచి కూ వరద సాయం నిధులు రావడంతో బాధితులకు సాయం అందించే విషయంలో ఎక్కడా నిర్లిప్తత ఉండరాదని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇస్తోంది. వరద బాధితుల్లో ఎక్కువగా విజయవాడ చుట్టు పక్కల వారే ఉన్నారు.












Click it and Unblock the Notifications