ఏపీ స్కూళ్లలో భారీ మార్పులు? యూనిఫాం మార్పు, విద్యార్ధుల కిట్లూ..!
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడుతో పాటు మరికొన్ని మార్పులు చేసినా అవి ఫలితాలు ఇవ్వడం లేదని భావిస్తున్న ప్రభుత్వం మరోసారి సమూల మార్పులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా విద్యార్ధుల స్కూల్ యూనిఫారాన్ని మార్చబోతున్నారు. అలాగే విద్యార్ధులకు విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇస్తున్న స్కూల్ కిట్లూ మారిపోనున్నాయి.

గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు-నేడు పేరుతో స్కూళ్లలో రిపేర్లు చేపట్టింది. విద్యార్ధులకు పథకాలు ఇచ్చింది. దీంతో పాటు విద్యార్ధుల సిలబస్ ను మార్చేసింది. దీంతో పాటు చాలా మార్పులు చేసింది. పలు స్కూళ్లను రద్దు చేసేసింది. ఇవన్నీ విద్యావ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయని ప్రస్తుత కూటమి సర్కార్ భావిస్తోంది. అందుకే వచ్చీ రాగానే టీచర్లపై భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పాటు పలు మార్పులు అవసరమని భావిస్తోంది.
ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల స్కూల్ డ్రెస్ లను మార్చబోతున్నారు. అలాగే విద్యార్ధులకు ఇస్తున్న కిట్లూ మారిపోనున్నాయి. కిట్లలో ఇస్తున్న బ్యాగ్ ల నాణ్యత నాసిరకంగా ఉందని భావిస్తున్న ప్రభుత్వం దాన్ని పెంచబోతోంది. దీని కోసం అక్టోబరు మొదటి వారంలో టెండర్లు నిర్వహించి, జూన్ 12 నాటికి కిట్లు అందించేలా సమగ్ర శిక్షా అభియాన్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.దీన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
-
గరికపాటి వివాదం: పద్మశ్రీతో గౌరవిస్తే, దానికి సార్థకత తెచ్చేలా సలహాలు ఇవ్వాలి కానీ అవమానిస్తారా? -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications