మచిలీపట్నం కు మహర్దశ!!

ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటకం పైన కూడా దృష్టి సారిస్తుంది. రాష్ట్రంలో పర్యాటక పరంగా అభివృద్ధి చెయ్యాల్సిన ప్రాంతాలను పరిశీలిస్తుంది. ఈ క్రమంలోనే మచిలీపట్నం వాసులకు శుభవార్త చెప్పింది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా మంగినపూడి బీచ్ అభివృద్ధి చేస్తామని చెప్పింది.

మంగినపూడి తీరాన్ని సందర్శించిన మంత్రి
బందరుకు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని జగన్ ప్రభుత్వ హయాంలో నాశనం చేశారని, మళ్ళీ ఈ బీచ్ కు పునర్వైభవం తెస్తామని , దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్ తో కలిసి మంగినపూడి బీచ్ సందర్శించారు.

Chandrababu govt decided to develop machilipatnam Manginapudi beach as tourist place

ఐదేళ్ళ జగన్ పాలనలో పర్యాటకం నిల్
మంగినపూడి బీచ్ లో కలయదిరిగిన మంత్రి వసతులు, రక్షణ చర్యలు గురించి అక్కడకు వచ్చిన పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్ లో అనేక అభివృద్ధి పనులు చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ పనుల్ని పడకేయించారని మండిపడ్డారు. అభివృద్ధిపనులు చేయకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారని నిప్పులు చెరిగారు. ఐదేళ్ల జగన్ పాలనలో పర్యాటకాన్ని పడకేయించారని అసహనం వ్యక్తం చేశారు.

తీర ప్రాంతంలో జగన్ కాలపు విధ్వంసం
మట్టి అమ్ముకుని బీచ్ పరిసరాలను నాశనం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు . కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తాం అన్నారు కొల్లు రవీంద్ర.

పర్యాటకంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి
అవసమైన మేరకు హోటల్స్, రిసార్ట్స్, బీచ్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చడతామని ఆయన స్పష్టం చేశారు. భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. చంద్రబాబు సర్కార్ ప్రజల ఆహ్లాదం కోసం పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేసే పనిలో ఉందని ఆయన వెల్లడించారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి వసతులు కల్పిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+