బ్రహ్మోత్సవాలకు ముందే బంఫర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు, వైసీపీతో ఉన్న వాళ్లకు చెక్
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు తల ఊపుతూ పనిచేసిన పోలీసు అధికారులపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలోనే ఆ పార్టీ నాయకులకు సహకరించకుండా ప్రజల కోసం పని చేసిన పోలీసులు, పోలీసు అధికారులకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పదోన్నతలు కల్పిస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులతో కలిసి కుమ్మక్కు అయిన పోలీస్ అధికారులపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంది. తిరుపతి జిల్లాలోని ముగ్గురు పోలీసు అధికారులకి ప్రమోషన్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం వారిని వేరే విభాగాలకు బదిలీ చేసింది. ఇదే సమయంలో ఏఎస్పీకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని వేరే విభాగానికి బదిలీ చేశారు.

ఇంటిలిజెన్స్ డీఎస్పీ అటాచ్మెంట్ తిరుపతి పీటీసీ కార్యాలయంలో పనిచేస్తున్న రామకృష్ణకు ఏఎస్పీగా ప్రమోషన్ ఇచ్చి తిరుమల శాంతి భద్రతల విభాగం ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట డీఎస్పీగా పనిచేస్తున్న వెంకటాద్రికి అదనపు ఎస్పీగా ప్రమోషన్ ఇచ్చి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చెయ్యాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న రవి మనోహరాచారిని తిరుపతి శాంతి భద్రతల విభాగం ఎస్పీగా నియమించారు.
తిరుపతి శాంతి భద్రతల విభాగం ఏఎస్పీగా పనిచేస్తున్న నాగభూషణరావును తిరుపతి క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో పలువురు పోలీసు అధికారులను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చెయ్యాలని, కొందరు పోలీసులను ఆయా జిల్లాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల ఆదేశాలతో ఇతర పార్టీ నాయకులపట్ల తోక తిప్పిన పోలీసు అధికారులకి ఇప్పుడు ఆతోక కట్ చేయడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. తిరుమల బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో తిరుపతి జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications