Balakrishna Birthday : బాలయ్యకు చంద్రబాబు బర్త్ డే విషెస్- స్పెషల్ ట్వీట్ తో..
టాలీవుడ్ టాప్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో భారీ కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే నందమూరి, నారా కుటుంబ సభ్యులు బాలయ్యకు విభిన్న రీతుల్లో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇదే క్రమంలో బాలకృష్ణ బావ, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న పాత్రల్లో రాణిస్తున్న బావమరిది బాలయ్యకు చంద్రబాబు తనదైన శైలిలో పొగడ్తలు కురిపిస్తూ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, బాలయ్య అభిమానులు ఈ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.

"నటునిగా కళాసేవ... ఎమ్మెల్యేగా ప్రజా సేవ... ఆసుపత్రి నిర్వహణతో సమాజ సేవ చేస్తున్న మా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మీరు... నిండు నూరేళ్లూ ఆనందంతో, ఆరోగ్యంతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను." అంటూ బాలయ్య పుట్టినరోజున ఆయనపై అభిమానాన్ని చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.
చంద్రబాబు పెట్టిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ పలువురు అభిమానులు గతంలో చంద్రబాబుతో బాలయ్య దిగిన ఫొటోల్ని ట్విట్టర్ లో పెడుతున్నారు. చంద్రబాబుకూ, బాలయ్యకూ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసేలా ఈ ఫొటోలు ఉన్నాయి. బాలయ్య పుట్టినరోజున ఈ ఫొటోల్ని చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications