Kandukur : కందుకూరు మృతులకు 15 లక్షలు అందించిన చంద్రబాబు-టీడీపీ నేతలు మరో 8లక్షలు

నెల్లూరు జిల్లా కందుకూరులో నిన్న చంద్రబాబు రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిన్న చనిపోయిన ప్రతీ కార్యకర్త కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తున్నారు. అలాగే పార్టీ నేతలు రూ.8 లక్షలు సేకరించి వారి కుటుంబాలకు ఇస్తున్నారు.

నిన్న కందుకూరు ఘటన నేపథ్యంలో అక్కడే ఉండిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మృతులను సందర్శించి నివాళులు అర్పించారు. వారి అంత్యక్రియలు కూడా పార్టీ తరఫునే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన చంద్రబాబు వారికి పార్టీ తరఫున ప్రకటించిన రూ.15 లక్షల సాయాన్ని అందజేశారు. అలాగే పార్టీ తరఫున మరో 8 లక్షలు సేకరించి ఇస్తున్నట్లు వారికి తెలిపారు. మృతుల కుటుంబాల్ని అన్ని విధాలా ఆదుకుంటామని, వారి పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

chandrababu handover rs.15 lakhs to each kandukur victim family, rs.8 lakhs from leaders

కందుకూరు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్త గడ్డం మధు ఇంటికి వెళ్ళిన చంద్రబాబు.. మృత దేహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి....వారికి దైర్యం చెప్పిన టీడీపీ అధినేత, పార్టీ తరుపున రూ.15 లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం టీడీపీ తరఫున సాయం అందిస్తున్న వారి వివరాలను పార్టీ మీడియా విభాగం వెల్లడించింది. ఇందులో కందుకూరు స్ధానిక నేతలతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా ఉన్నారు.

chandrababu handover rs.15 lakhs to each kandukur victim family, rs.8 lakhs from leaders

కందుకూరు ప్రమాద మృతుల కుటుంబాలకు టీడీపీ నుంచి, పార్టీ నేతల నుంచి కలిపి రూ.24 లక్షల ఆర్థిక సాయం

1.తెలుగు దేశం పార్టీ ఆర్థిక సాయం రూ.15,00,000/-

2.ఇంటూరి నాగేశ్వర్ రావు రూ. 1 లక్ష

3. ఇంటూరి రాజేష్ రూ.1 లక్ష

4.శిష్ట్లా లోహిత్ రూ. 1 లక్ష

5.బేబీ నాయన రూ.50,000

6.కేశినేని చిన్ని రూ.50,000

7.కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు.

chandrababu handover rs.15 lakhs to each kandukur victim family, rs.8 lakhs from leaders

8.కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష

9.అబ్దుల్ అజీజ్ రూ.50,000

10 పోతుల రామారావు రూ.50,000

11.పొడపాటి సుధాకర్ రూ.50,000

12. వెనిగండ్ల రాము రూ. 50,000

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+