వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ వైఖరి: మౌనమేంటని బాబుని నిలదీసిన అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu has been silent even after the Telangana government raised the nativity issue: Ambati
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్‌కు పలు అంశాల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయని, ఇవి అంతిమంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే నష్టం కలిగిస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఫీజు రీయింబర్సుమెంట్స్, స్థానికత తదితర సమస్యలు ఉన్న విషయం తెలిసిందే.

దీనిపై అంబటి మాట్లాడారు. వీటి ప్రభావం సీమాంధ్ర పైనే ఎక్కువగా పడుతుందన్నారు. సమస్యల పైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలా కాదంటే చంద్రబాబు కేంద్రం సాయాన్ని కోరాలని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం స్థానికత 1956 అని చెప్పడంపై చంద్రబాబు ఏమీ మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన కూడా ఆయన వైఖరి అలాగే ఉందని ఆరోపించారు. అంతేకాకుండా హైదరాబాదులోని పలు ముఖ్య ఆసుపత్రులలో సీమాంధ్రులకు ట్రీట్‌మెంట్ నిరాకరిస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

ఎంసెట్ కౌన్సెలింగ్ పైన సుప్రీం కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని అంబటి చెప్పారు. తనకు పరిపాలనలో ఎంతో అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. విభజన వల్ల ఏపీ రైతులు, విద్యార్థులు చివరకు పేషెంట్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటి పైన బీజేపీ, కాంగ్రెసు, టీడీపీలు స్పందించాలన్నారు.

English summary
The impact was much higher on the people of Seemandhra as their Chief Minister, Chandrababu Naidu, has neither taken up the core issues with his Telangana counterpart on his own nor has sought the Centre’s mediation on disputes, party spokesperson Ambati Rambabu stated here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X