వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శంషాబాద్ రూటుకు మారిన బాబు హెలికాప్టర్, పుష్కరాల్లో డ్రోన్లు

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లాలో పుష్కరాల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. అనంతరం హెలికాప్టర్‌లో విజయవాడ వెళ్లాలనుకున్నారు.

శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో విజయవాడ బయలుదేరారు.

వాతావరణం అనుకూలించకపోవడంతో విజయవాడ వెళ్లాల్సిన చంద్రబాబు హెలికాప్టర్ హైదరాబాదులోని శంషాబాదుకు దారి మళ్లించారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఏపీ సీఎం, విమానంలో గన్నవరం బయలుదేరారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

పుష్కరాల సందర్భంగా ఇచ్చే కృష్ణా హారతికి 'పవిత్ర హారతి' అని పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పుష్కరాల ఆహ్వాన పత్రికను ఇప్పటికే ప్రధాని మోడీకి ఇచ్చామని, రాష్ట్రపతి, పీఠాధిపతులకు ఇవ్వాలని ఆదేశించారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

పీఠాధిపతులను మంత్రులు వెళ్లి ఆహ్వానించాలని, ఢిల్లీ పెద్దలను కేంద్ర మంత్రులు, ఎంపీలు ఆహ్వానించాలని పేర్కొన్నారు. ఆహ్వానాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావుకు సూచించారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

భక్తుల భద్రత విషయంలో అన్ని చర్యలు చేపట్టాలని హోంశాఖను ఆదేశించారు. ఘాట్ల వద్ద డ్రోన్లను వినియోగించాలని, అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

ట్రాఫిక్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పుష్కరాల పనులను సకాలంలో చేయకపోయినా, నాసిరకంగా చేసినా గుత్తేదార్లను బ్లాక్‌లిస్టులో పెడతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

పుష్కర పనుల ప్రగతిని సోమవారం నాడు కర్నూలు కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. అనంతరం శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్లను పరిశీలించారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

గుత్తేదారులు చిన్నవారైనా, పెద్దవారైనా చర్యలు తప్పవని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

పనుల నాణ్యతాలోపంపై ఆయా శాఖల అధికారులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే భయం ఉంటుందన్నారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

ముఖ్యమంత్రి స్థాయిలో ఏడుసార్లు సమీక్షలు నిర్వహించినా యంత్రాంగం మారకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రస్తుతం పుష్కరాల పనులు 50శాతం లోపే పూర్తయ్యాయని, మరో 24 రోజులే గడువు ఉందన్నారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

విజయవాడ మున్సిపల్‌ మైదానం, అమరావతి, శ్రీశైలంలో సాంస్కృతిక కార్యక్రమాలను 11వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. ఇస్కాన్‌, టిటిడి, ధాన్యం మిల్లర్లతో మాట్లాడి అన్నదానం నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాల కోసం జొన్నవిత్తుల రాసిన 'జైజైకృష్ణవేణి.. జైజై బృహస్పతి' పాటను చంద్రబాబు విన్నారు. పాటపై అభిప్రాయాలు తీసుకుని, మార్పులు చేర్పులు చేయాలని సూచించారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

వైద్య, ఆరోగ్యశాఖ నుంచి సమీక్షకు ఉన్నతస్థాయి అధికారులు ఎవరూ రాలేదు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారి రెండు, మూడు సమీక్షలకు రాలేదని ఆగ్రహించారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో 54 శాతం పూర్తయ్యాయని, శ్రీశైలం ఘాట్‌ పనులు కొంచెం నెమ్మదిగా జరుగుతున్నాయని ఆ శాఖ అధికారులు వివరించారు. ఈ నెల చివరినాటికి పూర్తి చేస్తామన్నారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

రోడ్లు, భవనాలశాఖ చేపట్టిన 132 పనుల్లో 33 పూర్తయ్యాయని, మరో 99 వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

పంచాయతీరాజ్‌ శాఖ తరఫున చేపట్టిన 379 పనుల్లో 218 పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 583 పనులు చేపట్టగా 154 పూర్తయ్యాయని మరో అధికారి తెలిపారు.

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

కృష్ణా పుష్కరాలపై సమీక్ష

శ్రీశైలం, సున్నిపెంటలను తిరుమల, తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. హెలికాప్టర్లు వచ్చే పోయేందుకు వీలుగా శాశ్వత ప్రాతిపదికన హెలిపోర్టును సున్నిపెంటలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు.

English summary
Chandrababu helicopter changes route due to adverse climatic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X