Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొడాలి అడ్డాలో చంద్రబాబు-ఈ ప్రశ్నలకు జవాబిచ్చేలా-టీడీపీ అభ్యర్దిని ప్రకటించే ఛాన్స్ ?

ఏపీలో గుడివాడ రాజకీయాలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. గతంలో ఎన్టీఆర్ హయాంలోనూ, ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్ హయాంలోనూ, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనూ గుడివాడ పేరు ఏదో రకంగా మార్మోగుతూనే ఉంది. అందులోనూ కొడాలి నాని పేరుతో గుడివాడ నిత్యం వార్తల్లోకి వస్తూనే ఉంది. గుడివాడను తన పేరుకి కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్న కొడాలి నానిని ఢీకొట్టేందుకు సరైన అభ్యర్ధి లేక ఇబ్బందులు పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ అక్కడ పర్యటించబోతున్నారు.

ఇప్పటికే కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటన కోసం బందరు చేరుకున్న చంద్రబాబు ఇవాళ నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొని అనంతరం గుడివాడ చేరుకోబోతున్నారు. ముందుగా గుడివాడలో రోడ్ షో నిర్వహించి అనంతరం బహిరంగసభలోనూ పాల్గొంటారు. గతంలో మినీ మహానాడు ఏర్పాటుకు ఇక్కడ ప్రయత్నాలు చేసినా ఫలించ లేదు. ఓవైపు పార్టీలో గ్రూపు తగాదాలు, మరోవైపు కొడాలి రూపంలో బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కొంటున్న చంద్రబాబుకు ఇవాళ పర్యటన కత్తిమీద సాములా మారింది.

chandrababu lands in kodali nanis gudivada to challenge him

గుడివాడ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదోసారి గెలుపుపై దృష్టిసారించిన కొడాలి నాని హవాను అడ్డుకోవాలంటే ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా గుడివాడ రాజకీయాల్లో అంగబలం, అర్ధబలంతో ఎంట్రీ ఇచ్చిన ఎన్నారై వెనిగండ్ల రాముకు తోడు ఎన్నో ఏళ్లుగా అక్కడే పాగా వేసిన రావి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చి వీరిలో ఒకరిని టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఇవాళ గుడివాడ టీడీపీ అభ్యర్ధిపై ప్రకటన రావొచ్చంటున్నారు.

మరోవైపు గుడివాడలో చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబు పర్యటిస్తున్నారు. గతంలో తన ప్రభుత్వ హయాంలో ఓసారి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత అప్పట్లో తమ పార్టీలో ఉన్న దేవినేని అవినాష్ ను ఇక్కడ అభ్యర్ధిగా నిలబెట్టినా ప్రచారానికి మాత్రం రాలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా గుడివాడకు రాలేదు. దీంతో గత కొన్నేళ్లుగా తనపై బూతులతో విరుచుకుపడుతున్న సొంత సామాజిక వర్గ నేత, స్ధానిక ఎమ్మెల్యే కొడాలికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+