Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్ ఫైర్..! మంత్రులకు కీలక ఆదేశం..!

ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ, పలు హెచ్చరికలు చేస్తున్నా వీరి వ్యవహారశైలిలో మార్పు రావడం లేదు. తాజాగా ఇలా వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది. దీంతో ఇవాళ కేబినెట్ భేటీకి ముందే మంత్రి నారా లోకేష్ వీరిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సీఎం కూడా వీరిపై ఆగ్రహంగా ఉన్నట్లు వారికి తెలిపారు.

ఇవాళ జరిగిన మంత్రివర్గ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదాస్పద ఘటనలపై మంత్రులతో నారా లోకేశ్ ప్రస్తావన తెచ్చారు.
తాజాగా వివాదాల్లో చిక్కుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్ అంశాల ప్రస్తావన తెచ్చారు. అలాగే రౌడీ షీటర్ శ్రీకాంత్‍కు పెరోల్ సిఫార్సు చేసిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, సునీల్ అంశాలపై ఆరా తీశారు. అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలు సహా మొత్తం ఏడుగురి తీరు సరికాదన్ని లోకేశ్ తెలిపారు. సీఎం కూడా ఏడుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నట్లు మంత్రులకు లోకేశ్ తెలిపారు.

Chandrababu lokesh Cracks Down on MLA Controversies Instructs Ministers to Correct Course

మరోవైపు ఖైదీల పెరోల్ విషయాల్లో ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆచితూచి వ్యవహరించాలని హోంమంత్రి అనితకు లోకేష్ సూచించారు. అలాగే దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై ఫిర్యాదులను లోకేశ్ దృష్టికి మంత్రులు తెచ్చారు. దీనిపై స్పందించిన లోకేష్.. అర్హులు నష్టపోకుండా పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుందామన్నారు. అనంతరం కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu lokesh Cracks Down on MLA Controversies Instructs Ministers to Correct Course

కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని కేబినెట్ లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. గాడితప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటంపైనా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+