ఇన్వెస్ట్ చేస్తే శ్రీవారి దర్శనం: బాబు ఆఫర్, మోడీ మోగించారని..
హైదరాబాద్/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'కొత్త ఆలోచన' చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు నెలకొల్పే వారికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరన తిరుమలలో ప్రత్యేక దర్శనాలు ఉంటాయని చెప్పారు. ఆయన గురువారం సీఐఐ సమావేశంలో మాట్లాడారు.
స్మార్ట్ సిటీ అంటే నిరంతరం అభివృద్ధి చెందే నగరం అన్నారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్మించడం నా కల అని చెప్పారు. స్మార్ట్ సిటీకి అమెరికా, సింగపూర్ దేశాలు కూడా నిర్వచనం చెప్పలేదన్నారు. విశాఖపట్నంను స్మార్ట్ సిటీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని చెప్పారు.
మన దేశంలోనే ఎక్కువమంది ఇంజినీర్లు తయారువుతున్నారని చెప్పారు. ఆరు నెలలుగా భారత దేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని అన్నారు. మోడీ చేసిన స్వచ్ఛ భారత్ ఆలోచన అద్భుతమని కొనియాడారు. చిత్తూరు జిల్లాను పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.

మాస్టర్ ప్లాన్ ఆరు నెలల్లో..: నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధానికి మాస్టర్ ప్లాన్ ఆరు నెలల్లో సిద్ధం చేస్తామని సింగపూర్ ప్రతినిధులు చెప్పారని మంత్రి నారాయణ వేరుగా చెప్పారు. ఇదే వేగం కొనసాగితే గడువుకన్నా ముందే ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
ఈ నెల 19 నుండి 23వ తేదీ వరకు ఏపీ అధికారుల బృందానికి శిక్షణ ఇస్తామని చెప్పారు. సింగపూర్ బృందానికి 95 శాతం సమాచారం ఇచ్చామని, మిగతాది ఇస్రో నుండి సేకరిస్తామని చెప్పారు. దాదాపు 500 సంవత్సరాల సమాచారాన్ని సింగపూర్ బృందం కోరిందని తెలిపారు.
కాగా, అంతకుముందు ఏపీ రాజధాని నిర్మాణం, మాస్టర్‌ప్లాన్‌పై ఏపీ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. గురువారం ఉదయం సింగపూర్ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులతో మంత్రి నారాయణ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో పాటు రాజధాని ప్రాంత పరిధిలోని అధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో పంటల వివరాలు, నీటిసమస్యలు, గతంలో వచ్చిన భూకంపాల వివరాలను సింగపూర్ ప్రతినిధులు అడిగారని మంత్రి నారాయణ చెప్పారు.












Click it and Unblock the Notifications