వల్లభనేని వంశీకి చెక్-వంగవీటి రాధాకు సీట్-ఒక్క దెబ్బకు మూడు పిట్టలు-చంద్రబాబు వ్యూహం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. మరో ఏడాది దాటితే ఎన్నికల వాతావరణం మొదలవడం కావడం. దీంతో విపక్ష టీడీపీ ఇప్పటినుంచే వేగంగా పావులు కదుపుతోంది. రాజకీయంగా తమకు బలమైన జిల్లాగా చెప్పుకునే కృష్ణాలో సైతం గత ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ.. తాజాగా ఇక్కడ రచిస్తున్న వ్యూహాలు చందరంగాన్ని తలపిస్తున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబు కదపబోతున్న ఓ పావు.. తన పార్టీకి మూడు ప్రయోజనాలు కల్పించబోతోంది.

కృష్ణాలో మారుతున్న లెక్కలు
ఏపీలో రాజకీయంగా అత్యంత యాక్టివ్ జిల్లాగా పేరు తెచ్చుకున్న కృష్ణాజిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోవడం, మరో ఏడాదిన్నరలో మరో ఎన్నికలకు సిద్ధం కావాల్సిన పరిస్ధితుల్లో విపక్ష టీడీపీ వ్యూహాల్ని పదునెక్కిస్తోంది. దీంతో విజయవాడతో పాటు కృష్ణాజిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు తప్పేలా లేవు.
ముఖ్యంగా గత ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లాలో గెలిచిన రెండు సీట్లలో ఒకటైన గన్నవరంలో వల్లభనేని వంశీ కొన్ని నెలల్లోనే వైసీపీకి ఫిరాయించారు. దీంతో ఆ స్ధానాన్ని భర్తీ చేయడంతో పాటు మరో రెండు స్ధానాల్లో బలమైన అభ్యర్ధుల కోసం టీడీపీ ఎదురుచూస్తోంది. దీంతో అన్నింటికీ కలిసి వచ్చేలా చంద్రబాబు కొత్త సమీకరణాన్ని సిద్దం చేశారు.

గన్నవరంలో గద్దెతో వంశీకి చెక్
గన్నవరంలో గత ఎన్నికల్లో గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీకి ఫిరాయించడం ఓ దెబ్బయితే అక్కడికెళ్లి చంద్రబాబుపై నిత్యం తీవ్ర విమర్శలు చేస్తుండటం మరో ఇబ్బందిగా మారింది. దీంతో గన్నవరంలో ఈసారి ఎలాగైనా వంశీని ఓడించాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు... అక్కడికి పాత కాపు, ప్రస్తుత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను పంపాలని నిర్ణయించారు. గతంలో గన్నవరం నుంచి గెలిచిన చరిత్ర ఉన్న గద్దెకు ఇప్పటికీ అక్కడ పూర్తిగా పట్టుంది. దీంతో పాటు గద్దెకు రాజకీయంగా, ప్రజల్లో కూడా సౌమ్యుడనే పేరుంది. దీంతో గద్దెను గన్నవరానికి పంపడం ద్వారా అక్కడ వంశీని ఓడించగలమని టీడీపీ భావిస్తోంది.

విజయవాడ తూర్పులో వంగవీటి రాధా
గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బలంగా వీచిన వైసీపీ పవనాల్ని తట్టుకుని టీడీపీ తరఫున గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన గద్దె రామ్మోహన్... పార్టీ కోరిక మేరకు తన పాత నియోజకవర్గమైన గన్నవరానికి వెళ్లనున్నారు. దీంతో ఆయన సిట్టింగ్ స్ధానంలో వంగవీటి వారసుడైన రాధాను రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. వాస్తవానికి గతంలో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాధాకు గత ఎన్నికల్లో మాత్రం అక్కడ వైసీపీ, టీడీపీ నుంచి కూడా సీటు దక్కలేదు. దీంతో ఆయన ఎప్పటికైనా తిరిగి తూర్పు నుంచే పోటీ చేయాలని పట్టు దలగా ఉన్నారు దీంతో వంగవీటి సేవల్ని గుర్తించి విజయవాడ తూర్పు నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తన్నట్లు తెలుస్తోంది.

దేవినేని అవినాష్ వర్సెస్ వంగవీటి రాధా
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో దేవినేని, వంగవీటి వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. గతంలో టీడీపీలో ఈ రెండు కుటుంబాలు ఉండగా కూడా ఉప్పునిప్పుగా ఉండేవారు. కానీ చంద్రబాబు సర్దిచెప్పడంతో కొంతకాలం కలిసి పనిచేస్తున్నట్లు కనిపించారు. అయితే దేవినేని అవినాష్ వైసీపీకి వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న వంగవీటి రాధా టీడీపీకి వచ్చేశారు. ఇప్పుడు చంద్రబాబు కొత్త సమీకరణాలతో వీరిద్దరూ తొలిసారి తూర్పు నియోజకవర్గం నుంచి ముఖాముఖీ పోరులో తలపడే అవకాశం దక్కబోతోంది. రాజకీయాల్లో జూనియర్ గా ఉన్న అవినాష్ తో పోలిస్తే స్ధానికంగా ఉన్న కుల సమీకరణాలు రాధాకే అనుకూలంగా ఉండే అవకాశముంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు
చంద్రబాబు తాజా వ్యూహంతో ఒక్క దెబ్బకు మూడు పిట్టలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ గన్నవరం వెళితే అక్కడ వంశీకి గట్టి పోటీ తప్పదు. అలాగే గద్దె రామ్మోహన్ స్ధానంలో బరిలోకి దిగే వంగవీటి రాధాతో దేవినేని అవినాష్ కు చెక్ పెట్టేందుకు వీలు కలుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గెలుపు కోసం, ఆ మాట కొస్తే సీటు కోసం ఎదురుచూస్తున్న వంగవీటి రాధాకు కూడా అక్కడ అవకాశం కల్పించడం ద్వారా టీడీపీకి మేలు కలుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు వ్యూహం ఫలిస్తే గన్నవరం, విజయవాడ తూర్పు రెండు స్దానాలు టీడీపీ ఖాతాలో పడటం ఖాయం.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications