టాలీవుడ్ కు చంద్రబాబు గుడ్ న్యూస్ ! అల్లు అర్జున్ ను అడ్డుపెట్టి పవన్ బిగ్ ప్లాన్ ?

ఏపీలో సంక్రాంతి సినిమాలకు టికెట్ల రేట్ల పెంపుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్న జరుగుతోంది. ఓవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఇకపై బెనిఫిట్ షోలకు కానీ, టికెట్ రేట్ల పెంపుకు కానీ అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందా లేక టాలీవుడ్ తో సీఎం, డిప్యూటీ సీఎం సంబంధాల నేపథ్యంలో వారిని కరుణిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.

హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు నో అని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే తేల్చిచెప్పేసింది. తాజాగా టాలీవుడ్ పెద్దలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి మరోసారి వారికి క్లారిటీ ఇచ్చేసారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఆశలన్నీ ఏపీలో చంద్రబాబు సర్కార్ పైనే. ఎందుకంటే సంక్రాంతి సినిమాలకు తెలంగాణతో పోలిస్తే ఏపీలో డిమాండ్ చాలా ఎక్కువ. దీంతో ఏపీ సర్కార్ నిర్ణయం కీలకంగా మారింది.

Chandrababu may permit spl prices for Sankranti movies reason behind pawan s appraisal to revanth

ఈసారి సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు బాలకృష్ణ డాకూ మహరాజ్ కూడా విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలూ అటు టాలీవుడ్ తో పాటు ఇటు ఏపీ ప్రభుత్వ పెద్దలకూ కీలకమే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరహాలో వీటికి బ్రేకులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం కావడం లేదని తెలుస్తోంది. ఇవాళ దిల్ రాజు- పవన్ కళ్యాణ్ భేటీలోనూ దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో తెలంగాణలో జరిగిన అల్లు అర్జున్ ఎపిసోడ్ కు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో భాష్యం చెప్పేశారు. అల్లు అర్జున్ తప్పిదం వల్లే సంధ్య థియేటర్ ఘటన జరిగిందని, బాధితుల్ని తర్వాత రోజు వెళ్లి బన్నీ కానీ, చిత్ర నిర్మాతలు కానీ పరామర్శించకపోవడం తప్పని, అలాగే అక్కడ అల్లు అర్జున్ కాదు రేవంత్ రెడ్డి ఉన్నా అదే పరిస్ధితి ఎదురయ్యేదని, మొత్తంగా గోటితో పోయే దానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నారంటూ అల్లు అర్జున్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ ఘటన కేవలం అల్లు అర్జున్ వరకే పరిమితం అన్నట్లు చెప్పుకొచ్చారు. తద్వారా రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉన్నారని, తమకు ఏపీలో ఆ పరిస్ధితి లేకపోవడంతో టాలీవుడ్ కు ఊరటనిచ్చేలాగే తమ నిర్ణయాలు ఉంటాయని చెప్పేసినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+