చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా ... దేశంలో బీజేపీ గెలిస్తే చీకటే .. ఓ టీవీ షో లో కేఏపాల్ హంగామా
Recommended Video
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో హంగామా సృష్టించారు . చంద్రబాబు, జగన్ , పవన్ కళ్యాణ్ వారు వీరు అని లేకుండా అందరి మీద తనదైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యాంకర్ పై పలుమార్లు ఆగ్రహం ప్రదర్శించిన పాల్ అసలు ఈ ఇంటర్వ్యూకి నేనెందుకు వచ్చాను అంటూ యాంకర్ ని ప్రశ్నించారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని వచ్చాను అని చెప్పిన ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. మళ్లీ మోదీ నాయకత్వం రాకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పిన కేఏ పాల్ ఓ దశలో నియంత్రణ కోల్పోయి ఆవేశపడ్డారు .

నా ముందు వీళ్ళంతా బచ్చాలే అని పాల్ ఫైర్
"నేను చంద్రబాబు లాగా, జగన్ లాగా, కాంగ్రెస్ నేతల్లాగా లక్షల కోట్లు దోచుకోలేదు. నా సొంత సంపాదననే 37 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో డొనేట్ చేస్తున్నాను" అంటూ చెప్పిన కేఏ పాల్ ను , టీవీ యాంకర్ ఇన్ని చేస్తున్న మిమ్మల్ని ఈ రాష్ట్ర నాయకులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడంలేదు? అంటూ ప్రశ్నించారు . ఇక ఈ మాటతో తోక తొక్కిన కోతిలా చిందులేశారు కేఏ పాల్. ' చంద్రబాబు నాయడు నా ముందు బచ్చా, వీళ్లందరూ నా ముందు బచ్చాలే ' వాట్ ఆర్ యు టాకింగ్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు.

బీజేపీ అధికారంలోకి వస్తే భారత్ లో అంధకారం
భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే భారత్ మరింత అంధకారంలోకి వెళ్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. తాను ముఖ్యమంత్రిని కాలేకపోయినా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి, కోర్టు ఆదేశాలకు విలువలేకుండా పోతుందని కే.ఏ.పాల్ అన్నారు. దేశం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ఒక ప్రవర్తగా తాను ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పకుంటే ఆ పాపం తనను వెంటాడుతుందని, అందకే తాను ఈ విషయాన్ని మీడియాకు చెప్పినట్టు కే.ఏ.పాల్ తెలిపారు.

చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా... జగన్ ఓ క్రిమినల్..పవన్ లెక్కలో తీసుకోను ..పాల్
"చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా. జగన్ ఓ క్రిమినల్. పవన్ కళ్యాణ్ ను అయితే లెక్కలోకే తీసుకోను. వాట్ ఆర్ యూ టాకింగ్? నేనంతా నేషనల్ లీడర్స్ తోనే రాజకీయాలు చేస్తాను, కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్ పెద్దనాయకులా? మీరు చెబుతున్న చంద్రబాబు, జగన్ పెద్ద నాయకులా?" అంటూ తనదైన స్టైల్ లో 'నేను ఒక్క నిమిషంలో కోటి రూపాయలు సంపాదించగలను, నా సమయం వృథా చేయొద్దని' యాంకర్ పై మండిపడ్డారు. మీరు వ్యక్తిగత ప్రశ్నలు అడగొచ్చు కానీ మేం ఎలాంటి వ్యక్తిగత ప్రశ్నలు అడక్కూడదా? అంటూ మండిపడ్డారు . మీకు మరోసారి ఇంటర్వ్యూ ఇవ్వాలా? వద్దా? అంటూ యాంకర్ నే తిరిగి ప్రశ్నించాడు . పాల్ టీవీ షో చూసిన వారంతా అవాక్కయ్యారంటే పాల్ ఎలా ప్రవర్తించి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు .
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications