మంచి జిల్లాను నాశనం చేస్తారా?: చంద్రబాబు హెచ్చరిక
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు. విజయవంతంగా నిర్వహించిన నియోజకవర్గాలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు.. గ్రేడ్లను ప్రకటించారు.
Recommended Video

విజయవాడ: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు. విజయవంతంగా నిర్వహించిన నియోజకవర్గాలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు.. గ్రేడ్లను ప్రకటించారు. బుధవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల ఎమ్మెల్యేలకు గ్రేడ్లు చదివి వినిపించారు.

అసంతృప్తి.. కితాబు
పశ్చిమగోదావరి జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాలకు బీ గ్రేడ్ రావడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాలకు ఏ-గ్రేడ్ ఇచ్చారు. సెంట్రల్, ఈస్ట్‌లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం బాగా జరిగిందని చంద్రబాబు కితాబిచ్చారు.

నాశనం చేస్తున్నారు..
కాగా, అనంతపురం జిల్లా నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కంచుకోటగా ఉన్న మంచి జిల్లాను నాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో సీ గ్రేడ్‌లో ఉన్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక, పార్టీ అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

జగన్ పార్టీని ఎండగట్టండి..
ఇళ్ల స్థలాల చదునుకు నిధులు విడుదల చేయాలని ప్రజాప్రతినిధులను చంద్రబాబు ఆదేశించారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు కరపత్రాలను కూడా పంచాలన్నారు.

గాంధీ చూపిన మార్గంలోనే..
స్వేచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ అనే గాంధీజీ సిద్ధాంతాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. బుధవారం గీతం యూనివర్శిటీలో పద్మశ్రీ ప్రొ. కోనేరు రామకృష్ణారావు రచించిన 'గాంధీస్ ధర్మ' పుస్తకాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌తో పాటుగా ఎంపీ హరిబాబు, తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే గాంధీ కలలు రామరాజ్యం సాధ్యమవుతుందని స్పీకర్ కోడెల అన్నారు. స్వేచ్ఛ భారత్ , స్వచ్ఛ భారత్ అనేవి గాంధీ నినాదాలు అని, స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా పరిశుభ్రతలో దేశం వెనకబడి ఉండటం బాధాకరమన్నారు. మనదేశాన్ని మనమే బాగుచేసుకోవాలని, అందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications