ఎమ్మెల్యేలు వీడినా భయపడ, రిజైన్ చేరలేదు: బాబు
హైదరాబాద్: కాంగ్రెసు వీధికొక రౌడీని, ముఠాను తయారు చేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాంగ్రెసుకు చిత్తశుద్ధి, పద్ధతి లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. కోర్టు ఆదేశిస్తే తప్ప ఎన్నికలు నిర్వహించలేని స్థితిలో కాంగ్రెసు పడిందని ఆయన అన్నారు. పార్టీని శాసనసభ్యులు వీడినా తాను భయపడబోనని ఆయన అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు రాజీనామా లేఖ తనకు అందలేదని ఆయన అన్నారు. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆయన అడిగారు. ఏమైనా సమస్యలు ఉంటే తనకు చెప్పాలని, మీడియాకు ఎక్కవద్దని ఆయన నాయకులకు సూచించారు.
మున్సిపాలిటీల్లో పౌర సదుపాయాలు లేవని ఆయన అన్నారు. విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది లేదని ఆయన అన్నారు. తాగునీళ్ల పథకాల్లో కూడా అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 37.5 శాతం మంది మురికివాడల్లో నివసిస్తున్నారని ఆయన అన్నారు. పారిశుధ్యంలో అగ్రస్థానంలో ఉండే హైదరాబాద్ దిగజారిపోయిందని, హైదరాబాద్‌కు తమ ప్రభుత్వ హయాంలో క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

మున్సిపాలిటీలు అంధకారంలో, మురికికూపాలు మగ్గుతున్నాయని ఆయన చెప్పారు. 200 కోట్ల రూపాయలతో చేపట్టిన తాగనీటి పనులు ప్రారంభం కాలేదని ఆయన అన్నారు. ఆస్తిపన్నును విపరీతంగా పెంచారని ఆయన అన్నారు. కాంగ్రెసు సుస్థిర పాలన కూడా ఇవ్వలేకపోయారని ఆయన అన్నారు. కాంగ్రెసును భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కాంగ్రెసు నిర్వాకం వల్ల కేంద్రం నిధులు వెనక్కి వెళ్లాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోట్లు సంపాదించుకున్నాడని ఆయన ఆరోపించారు. తెరాస వసూళ్ల పార్టీగా మారిందని ఆయన అన్నారు. ఆర్టికల్ 73ని నిర్వీర్యం చేసిందని ఆయన అన్నారు.
ప్రజల నుంచి సలహాలు సేకరించి ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తామని చంద్రబాబు చెప్పారు. నియోజకవర్గాల స్థాయిల్లో ఎన్నికల ప్రణాళికలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ప్రజల నుంచి సలహాలు తీసుకోవడానికి వెబ్‌సైట్ పెడుతున్నట్లు తెలిపారు. తెలంగాణకు పార్టీ కమిటీ వేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications