వైసీపీ సర్కారుకు కూల్చడమే తెలుసు: బరితెగిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు

అమరావతి: ఏపీ ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ పార్టీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందని అన్నారు. కూల్చడం తప్ప కట్టడం రాని ఈ పాలకుల వైఖరితో శిథిలాలే మిగులుతున్నాయని ధ్వజమెత్తారు చంద్రబాబు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్మాణంలో ఉన్న ఎర్రన్నాయుడు చిల్డ్రెన్ పార్క్‌లో కూల్చివేతలు దారుణమని మండిపడ్డారు. వైసీపీ బరితెగింపును అడ్డుకోలేని అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధ్యలపై ఏం చర్యలు తీసుకున్నారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తుంటే డిప్యూటీ సీఎంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ పార్టీకి ఓట్లేసింది ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలకు కాదనే విషయం గుర్తుంచుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.

chandrababu naidu slams YSRCP govt for Yerrannaidu park vandalize issue.

ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్కు కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసనలు

నరసన్నపేటలో నిర్మిస్తున్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్కును కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలోనే దీని నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. నిధులు కూడా మంజూరు కావడంతో పార్కును నిర్మిస్తున్నారు. అయితే, శనివారం కొందరు వ్యక్తులు రెండు జేసీబీలతో అక్కడకు చేరుకుని నిర్మాణంలో ఉన్న పార్కును కూల్చివేశారు. పార్కు ప్రహరీ, రీడింగ్ రూమ్, కార్యాలయ గదులతోపాటు అంతర్గతంగా వేసిన రోడ్లను కూడా ధ్వంసం చేశారు.

సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మరికొందరు టీడీపీ కార్యకర్తలు పార్క్ వద్దకు చేరుకుని కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కూల్చివేత పనుల్లో ఉన్నవారు వారిపై దాడిచేయడంతో పరుగులు తీశారు. రమణమూర్తి ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు కూల్చివేతను అడ్డుకున్నారు. అందుకు ఉపయోగించిన రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రమణమూర్తితోపాటు పాటు టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపి ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

కాగా, ఎర్రన్నాయుడు పార్క్ నిర్మాణానికి రూ. 2 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అప్పటి కలెక్టర్ అనుమతులు కూడా ఉన్నాయి. నరసన్నపేట గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ. 34.50 లక్షలు విడుదల కావడంతో పనులు ప్రారంభించారు. అయితే, ఈ స్థలం తమదేనంటూ 15 మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనులు పూర్తిగా జరగకుండా ఆగిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+