పన్ను తగ్గింపు: ఏపీ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త, భారం రూ.1120కోట్లు

Recommended Video

    ఏపీ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త

    అమరావతి: రాష్ట్రంలోని వాహనదారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

    డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటర్‌కు రూ.2 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం వ్యాట్ రూపంలో రూ.4 వసూలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. తగ్గించిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి.

    chandrababu naidu wish to reduce excise duty Rs. 2 on litre petrol and diesel

    కాగా, పన్ను తగ్గింపుపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి రాష్ట్ర సర్కార్ తన ఎక్సైజ్ డ్యూటీ నుంచి 2శాతం మేర పన్ను తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ.1120 కోట్ల మేర భారం పడనుంది.

    రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ విపక్షాలన్నీ కలిసి సోమవారం భారత్ బంద్ చేపట్టాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బంద్ విజయవంతం కాగా, ఇతర రాష్ట్రాల్లో పాక్షికంగా కొనసాగింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+