Chaganti Koteswara Rao: సలహాదారు చాగంటికి చంద్రబాబు, లోకేష్ సలహాలివే..!

ఏపీలో తాజాగా విద్యార్ధుల నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాతో నియమితులైన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఇవాళ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తో విడివిడిగా భేటీ అయ్యారు. తాజాగా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన ఆయన వీరిద్దరినీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ ఆయనకు కర్తవ్య బోధ చేశారు.

ముందుగా విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ను చాగంటి కోటేశ్వరరావు కలిశారు. రాష్ట్రంలో తాజా పరిస్దితులపై చర్చించారరు. విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని నిర్ణయించామని, ఇందుకు మీ వంటి పెద్దల అమూల్యమైన సలహాలు అవసరమని లోకేష్ తెలిపారు. దీనికి స్పందనగా విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించేందుకు తమ వంతు సలహాలు, సహకారం అందిస్తానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.

chandrababu nara lokesh key suggestions to government adviser chaganti koteswara rao

అనంతరం సీఎం చంద్రబాబుతో సలహాదారు చాగంటి భేటీ అయ్యారు. వీరి భేటీలో భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందన్నారు. ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు చాగంటికి సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు.

chandrababu nara lokesh key suggestions to government adviser chaganti koteswara rao

స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని చంద్రబాబు ఆయనకు తెలిపారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతం అని, వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు. సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానని చాగంటి కోటేశ్వరావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+