అమరావతిపై చంద్రబాబు మూడంచెల వ్యూహం ! త్వరలో కమిటీ-తాజా ప్లాన్ ఇదే..
ఏపీలో అమరావతి రాజధానికి తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారానికి ముందే కీలక ఆదేశాలు ఇచ్చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కల్లా అమరావతిని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు భవిష్యత్తులో మూడంచెల వ్యూహంతో అమరావతిని రాజధానిగా తిరిగి నిలబెట్టాలని, ఐదేళ్లలో ఇక్కడికి వేగంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలను తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
ఐదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు వేగంగా అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదనను పూర్తిగా పక్కనబెట్టేందుకు అవసరమైన చర్యల్ని ఓవైపు తీసుకుంటూనే, మరోవైపు కోర్టుల్లో మూడు రాజధానులకు అనుకూలంగా దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకోవడం, అదే సమయంలో క్షేత్రస్ధాయిలో అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

తన ప్రమాణస్వీకారానికి ముందే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు వీలుగా చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం, అందుకు అనుగుణంగా పనులు జరగడం చూస్తూనే ఉన్నాం. ఇది పూర్తయ్యాక గతంలో నిర్మించిన భవనాల ఫిట్ నెస్ నిర్ధారణకు ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే కొత్తగా చేపట్టాల్సిన నిర్మాణాలను ఖరారు చేస్తారు. ఐదేళ్లలో అమరావతిని పూర్తి చేసి పూర్తిస్దాయి రాజధానిగా అమల్లోకి తేవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.
అమరావతిపై చంద్రబాబు మూడంచెల వ్యూహం ..త్వరలో కమిటీ-తాజా ప్లాన్ ఇదే..!!#Chandrababu #Amaravati #ApGovt #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/211nPdt6oy
— oneindiatelugu (@oneindiatelugu) June 10, 2024
మరోవైపు శాసన, న్యాయపరంగా ఉన్న అడ్డంకుల్ని తొలగించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో పాటు అసెంబ్లీలో తిరిగి సీఆర్డీయే, రాజధాని బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు. తద్వారా అమరావతిపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలు పడుతుందని భావిస్తున్నారు. ఇలా మూడంచెల వ్యూహంతో అమరావతి అభివృద్ధిని చంద్రబాబు గాడిన పెట్టబోతున్నారు.












Click it and Unblock the Notifications