ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల-ఢిల్లీకి బాబు, నందమూరి ఫ్యామిలీ-లక్ష్మీపార్వతిపై సస్పెన్స్ !

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మారకంగా కేంద్రం 100 రూపాయల నాణాన్ని ఈ నెల 28న విడుదల చేయబోతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్ లో జరిగే అధికారిక కార్యక్రమంలో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నారా, నందమూరి కుటుంబ సభ్యులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. దీంతో వారంతా ఆగస్టు 28న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లబోతున్నారు. అలాగే ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరవుతారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఈ ఏడాదితో ఎన్టీఆర్ శతజయంతి ముగిసిన నేపథ్యంలో దీనిపై 1923- 2023 అని ముద్రించారు.

chandrababu, ntr family to attend release of 100 rupees memorial coin in delhi on august 28

మరోవైపు ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొనబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఏపీలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేయబోతున్నారు. అలాగే తగిన ఆధారాల్ని సమర్పిస్తారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, వాటిపై రాష్ట్రంలోని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు చెప్తున్నారు. దీంతో సీఈసీ దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు.

అటు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాల్గొంటారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. వీరందరినీ ఆహ్వానించి ఎన్టీఆర్ భార్యను ఆహ్వానించకపోతే మరో వివాదం నెలకొంటుంది. దీంతో కేంద్రం ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. అలాగని ఆమెను ఆహ్వానిస్తే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంల పాల్గొంటారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. దీంతో మరో నాలుగు రోజుల పాటు ఈ ఉత్కంఠ కొనసాగేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+