పిల్లల్ని కంటే 30 వేలు, 40 వేలు..! చంద్రబాబు బంపర్ ఆఫర్..!

ఏపీలో జనాభా వృద్ధిని టార్గెట్ చేస్తున్న సీఎం చంద్రబాబు(Chandrababu).. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇద్దరిని మించి పిల్లల్ని కంటే భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను సైతం త్వరలో విడుదల చేయనున్నారు. వీటి ద్వారా ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రభుత్వం ప్రోత్సహించబోతోంది.

పవన్ కు అంబటి అదిరిపోయే పంచ్..! విజయ్ తో పోలికపై..!
పవన్ కు అంబటి అదిరిపోయే పంచ్..! విజయ్ తో పోలికపై..!

నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మరోసారి సంతానోత్పత్తి పెంచాల్సిన అవసరాన్ని ప్రజలకు గుర్తుచేశారు. సంపద సృష్టించి పేద వాళ్లకు పంచాలని, ఆర్ధిక అసమానతలు తగ్గించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటే అది అధికారుల వల్లేనన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పామని, ఇప్పుడు పిల్లలే సంపద అని చెప్తున్నానని చంద్రబాబు వెల్లడించారు.

Chandrababu Offers 30K for Third Child 40K for Fourth AP s Bold Push to Boost Population
ఏపీలో ఆదివారం పెట్రోల్ బంకుల బంద్ ? తేల్చేసిన ట్రేడర్స్ యూనియన్..!
ఏపీలో ఆదివారం పెట్రోల్ బంకుల బంద్ ? తేల్చేసిన ట్రేడర్స్ యూనియన్..!

అందుకే మూడో బిడ్డ పుట్టిన వెంటనే 30 వేల రూపాయలు ఇస్తామని, నాలుగో బిడ్డ పుడితే 40 వేలు ఇస్తామని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. పిల్లలు భారం అనుకోకూడదని, వాళ్లే సంపద అని గుర్తించాలని రాష్ట్రంలో తల్లితండ్రుల్ని సీఎం కోరారు. మరోవైపు తల్లికి వందనం పథకంలో భాగంగా ఇప్పటికే 15వేలు ఇస్తున్నామని, భగవంతుడు కరుణిస్తే దాన్ని మరింత పెంచేందుకు సైతం సిద్దంగా ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+